సినిమా

Bigg Boss Kirik Keerthi: బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు తీవ్రగాయాలు.. మందు బాటిల్‌తో దాడి

Bigg Boss Kirik Keerthi: తలకు తీవ్ర గాయాలైన కుమార్‌ను హుటాహుటిన ఆస్పత్రి తరలించింది పబ్ యాజమాన్యం.

Bigg Boss Kirik Keerthi: బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు తీవ్రగాయాలు.. మందు బాటిల్‌తో దాడి
X

Bigg Boss Kirik Keerthi: తెలుగు బిగ్‌బాస్‌కి ఎంత క్రేజ్ ఉందో మిగిలిన అన్ని భాషల్లో వస్తున్న ఆ షోకి అంతే క్రేజ్ ఉంది. అంతకు ముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసి పెద్దగా ప్రేక్షకులకు తెలియకపోయినా ఈ షోకి వచ్చిన తరువాత ఫేమస్ అయిపోతున్నారు. వారి గురించిన ఏ న్యూస్ వచ్చినా సోషల్ మీడియాలో ఫోకస్ అవుతున్నారు.

తాజాగా కన్నడ బిగ్‌బాస్ కంటెస్టెంట్ కిరిక్ కీర్తిపై బీర్ బాటిల్‌తో దాడి జరిగింది. గురువారం అతడు తన స్నేహితులతో కలిసి సదాశివనగర్‌‌లోని ఓ పబ్‌‌కు వెళ్లాడు. అక్కడ తన అనుమతి తీసుకోకుండా తనతో సెల్పీలు దిగేందుకు వచ్చిన వారిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

దీంతో ముగ్గురు వ్యక్తులు కుమార్ తలపై బీర్ బాటిల్‌తో దాడి చేశారు. తలకు తీవ్ర గాయాలైన కుమార్‌ను హుటాహుటిన ఆస్పత్రి తరలించింది పబ్ యాజమాన్యం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Next Story

RELATED STORIES