సినిమా

Shahid Kapoor: 'జెర్సీ' ఓటీటీ విడుదలను ఆపడానికి షాహిద్ కపూర్ షాకింగ్ నిర్ణయం..

Shahid Kapoor: తెలుగులో నేచురల్ స్టార్ నాని క్రేజ్‌ను, మార్కెట్‌ను అమాంతం పెంచేసిన చిత్రం ‘జెర్సీ’.

Shahid Kapoor: జెర్సీ ఓటీటీ విడుదలను ఆపడానికి షాహిద్ కపూర్ షాకింగ్ నిర్ణయం..
X

Shahid Kapoor: తెలుగులో నేచురల్ స్టార్ నాని క్రేజ్‌ను, మార్కెట్‌ను అమాంతం పెంచేసిన చిత్రం 'జెర్సీ'. అప్పటివరకు పక్కింటి అబ్బాయిలాగా, కామెడీ కమర్షియల్ ఎంటర్‌టైన్మెంట్ సినిమాల్లోనే ఎక్కువగా కనిపించిన నాని.. జెర్సీ నుండి తన స్టోరీ సెలక్షన్‌లో రూటు మార్చాడు. అయితే జెర్సీ సినిమా నాని కెరీర్‌లో ఎంత స్పెషలో అందరికీ తెలుసు. అలాంటి సినిమానే అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేశాడు దర్శకుడు గౌతమ్. కానీ ఇప్పుడు ఈ రీమేక్‌ విడుదల కష్టాల్లో పడింది.

హిందీ జెర్సీలో షాహిద్ కపూర్, మృణాల్‌ ఠాకూర్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. తెలుగులో డైరెక్షన్ చేసిన గౌతమ్ తిన్ననూరినే హిందీలో కూడా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ స్టార్ నిర్మాత అల్లు అరవింద్ చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో మరోసారి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు. జెర్సీ డిసెంబర్ 31న విడుదల కానుండగా చివరి నిమిషంలో దీని విడుదల వాయిదా పడింది.

ఒమిక్రాన్ కారణంగా పలు నార్త్ రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో సినిమా హాళ్లు కూడా మూతబడ్డాయి. దీంతో జెర్సీ సినిమా విడుదల ఆగిపోయింది. త్వరలోనే కొత్త విడుదల తేదీ కూడా ప్రకటిస్తామన్నాడు షాహిద్ కపూర్. కానీ నిర్మాతలు ఇప్పుడు జెర్సీ సినిమాను ఓటీటీకు అమ్మే ప్లాన్‌లో ఉన్నారట. దీనిని ఆపడానికి షాహిద్ కపూర్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

షాహిద్ కపూర్.. జెర్సీ సినిమా కోసం రూ. 31 కోట్ల రెమ్యునరేషన్‌ను అందుకోనున్నాడు. అయితే తన రెమ్యునరేషన్ నుండి కాస్త కట్ చేసినా పర్వాలేదు కానీ.. సినిమాను మాత్రం ఓటీటీలో విడుదల చేయొద్దని నిర్మాతలను రిక్వెస్ట్ చేశాడట షాహిద్. ఒకవేళ పరిస్థితులు ఇలాగే ఉంటే షాహిద్ ఎంత కాదనుకున్నా.. జెర్సీ ఓటీటీలో విడుదల అవ్వాల్సిందే అనుకుంటున్నారు బీ టౌన్ ప్రేక్షకులు..

Next Story

RELATED STORIES