రూ.12.19 కోట్ల విలువైన స్థలాన్ని ఖరీదు చేసిన షారూఖ్ కూతురు

రూ.12.19 కోట్ల విలువైన స్థలాన్ని ఖరీదు చేసిన షారూఖ్ కూతురు
సుహానాలో అద్భుతమైన నటి దాగి ఉందని షబానా అజ్మీ చెప్పింది


బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ రూ.12.19 కోట్ల విలువైన వ్యవసాయ భూమిని కొనుగోలు చేసింది. ముంబై అలీబాగ్ సమీపంలోని తాల్ గ్రామంలో ఈ వ్యవసాయ భూమి ఉంది. రిజిస్ట్రేషన్ లో సుహానా పేరును రైతుగా నమోదు చేశారు. ఆమె తన మొదటి సంపాదనతో ఈ స్థలాన్ని కొన్నారు. సవితా ఛిబ్బర్, నమితా చిబ్బర్ డైరెక్టర్లుగా ఉన్న డెజా వు ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసినట్లుగా తెలుస్తోంది. సుహానా అమ్మమ్మ సవితా ఛిబ్బర్. ఆవిడ చెల్లెలు నమితా ఛిబ్బర్.

భూమి విస్తీర్ణం 1.5 ఎకరాలు, ఇది 2,218 చదరపు అడుగులు. కొనుగోలు కోసం ఆవిడ రూ.77.46 లక్షల స్టాంప్ డ్యూటీని చెల్లించింది. షారూఖ్ ఖాన్ కు ఇప్పటికే అలీబాగ్ లో సముద్రానికి ఎదురుగా విలాసవంతమైన బంగ్లా ఉంది. ఇందులో స్విమ్మింగ్ పూల్, హెలీప్యాడ్ ఉన్నాయి. షారూఖ్ తన 52వ పుట్టినరోజున గెస్ట్ లకు ఈ బంగ్లాలోనే విందును ఇచ్చారు.


సుహానా ఖాన్ UKలోని సస్సెక్స్‌లోని ఆర్డింగ్లీ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ చేసింది. 2022లో న్యూయార్క్ యూనివర్శిటీ టిస్చ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి నటనలో పట్టా పొందింది. సునైనా కొనుగోలు చేసిన అలీబాగ్ లో దీపికా పదుకొనే-రణ్‌వీర్ సింగ్, అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ, పారిశ్రామికవేత్త గౌతమ్ సింఘానియాకు ఇళ్లు ఉన్నాయి.


షారూఖ్ తన పిల్లలైన ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ సృజనాత్మక కెరీర్‌తో పాటు వ్యాపారవేత్తలు కావాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. షబానా అజ్మీ ఇప్పటికే షారుక్ తో మాట్లాడుతూ, సుహానాలో అద్భుతమైన నటిగా దాగి ఉందని చెప్పింది.

Tags

Read MoreRead Less
Next Story