సినిమా

Shahrukh Khan: మొక్కు తీర్చుకుంటున్న షారూఖ్ ఖాన్..

Shahrukh Khan: డ్రగ్స్‌ కేసులో అరెస్టై 22 రోజులపాటు జైలులో ఉన్న షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ స్వగృహానికి చేరుకున్నాడు.

Shahrukh Khan (tv5news.in)
X

Shahrukh Khan (tv5news.in)

Shahrukh Khan: డ్రగ్స్‌ కేసులో అరెస్టై 22 రోజులపాటు జైలు జీవితం గడిపిన అనంతరం షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ స్వగృహానికి చేరుకున్నాడు. కుమారుడికి బెయిల్‌ లభించిన సందర్భంగా ముంబయిలో ప్రసిద్ధి గాంచిన సిద్ధి వినాయకుడి ఆలయంలో షారుక్‌ పూజలు చేయనున్నట్లు సమాచారం. గణేశుడికి కృతజ్ఞతలు తెలిపేందుకు బాలీవుడ్‌ బాద్‌షా త్వరలోనే సిద్ధి వినాయకుడి ఆలయానికి వెళ్లి పూజా కార్యక్రమాలు చేపట్టనున్నారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

స్వతహాగా వినాయకుడిని ఆరాధించే షారుక్‌ ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించి పూజలు చేస్తారు. ఇందులో కుటుంబసభ్యులందరూ పాల్గొంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షారుక్‌ చివరి పోస్టు సైతం వినాయకుడిదే కావడం విశేషం. ఈ ఏడాది వినాయకచవితి సందర్భంగా తన ఇంట్లో పూజలు జరిపిన వినాయకుడి ఫొటోను ఆయన ఇన్‌స్టాలో పంచుకున్నారు

Next Story

RELATED STORIES