Shilpa Shetty: జాతీయ జెండాకు ఘోర అవమానం.. ట్రోలర్స్ కు గట్టి రిప్లై ఇచ్చిన శిల్పా శెట్టి

Shilpa Shetty: జాతీయ జెండాకు ఘోర అవమానం.. ట్రోలర్స్ కు గట్టి రిప్లై ఇచ్చిన శిల్పా శెట్టి
శిల్పాశెట్టిపై ట్రోల్స్.. గట్టిగా సమాధానంతో కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు భారత జాతీయ జెండాను ఎగురవేసిన చిత్రాలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నుండి చాలా మంది ప్రముఖులు అభిమానులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులను పంచుకున్నారు. అందులో భాగంగా హీరోయిన్ శిల్పాశెట్టి కూడా ఓ వీడియోతో ఆకర్షించింది. జెండా ఎగురవేస్తున్న ఓ వీడియోను షేర్ చేసిన శిల్పాశెట్టిని ఇప్పుడు నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఎందుకంటే..

జెండా ఎగురవేసే సమయంలో శిల్పాశెట్టి బూట్లు ధరించి ఉండడంతో నెటిజన్లు ఇప్పుడు ఆమెను దాపుణంగా ట్రోల్ చేస్తున్నారు. జాతీయ జెండాను ఆమె అవమానపర్చిందని, అగౌరవంగా ఉన్నారని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ వీడియోలో శిల్పాశెట్టి తన కొడుకులు, భర్త రాజ్ కుంద్రా, తల్లితో కలిసి కనిపించింది.

ట్రోల్స్‌కు రిప్లై ఇచ్చిన శిల్పాశెట్టి

శిల్పాశెట్టిపై సోషల్ మీడియాలో ఈ రకమైన ట్రోల్స్‌ రావడంతో.. ఆమె తాజాగా స్పందించింది 'బ్యాక్ ఆఫ్' అని కోరుతూ ఒక వ్యాఖ్యను రాసుకువచ్చింది. 'జెండాను ఎగురవేసేటప్పుడు ఎలా ఉండాలో ప్రవర్తన నియమాల గురించి నాకు తెలుసు. నా దేశం, జెండా పట్ల తనకు గౌరవం గౌరవం ఉందని తెలిపింది. అయినా జెండా ఎగురవేసేటప్పుడు చెప్పులేసుకోకూడదన్న నియమం ఎక్కాడా లేజని ఆమె స్పష్టం చేసింది. తాను గర్వించదగిన ఇండియన్ ని అని చెప్పింది. దాంతో పాటు ' ఆమె ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా గురించిన సమాచారం స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేసింది. ట్రోలర్లు తమ అవగాహనా రాహిత్యాన్ని ప్రదర్శించడం, ప్రతికూల వాతావరణాన్ని సృష్టించడాన్ని అస్సలు మంచిది కాదు అని ఆమె ట్రోలర్స్ కి గట్టిగా కౌంటర్ ఇవ్వడం గమనార్హం.

అమితాబ్ బచ్చన్, సానియా మీర్జా లాంటి వారు కూడా..

2015లో అమితాబ్‌ బచ్చన్‌ మెడకు త్రివర్ణ పతాకాన్ని చుట్టుకున్నారని ఆరోపిస్తూ ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో అభిషేక్ బచ్చన్ పేరును కూడా ఫిర్యాదుదారుడు పేర్కొన్నట్లు సమాచారం. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భారత జాతీయ జెండా ఉన్న టేబుల్‌పై తన పాదాలను చూపించిన ఫోటో వైరల్ కావడంతో దీనికి విపరీతమైన విమర్శలకు వచ్చాయి. మందిరా బేడీ జెండా చీర అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ ఆమె నడుము కింద భారత జాతీయ జెండా కనిపించడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. డర్టీ పిక్చర్ అనే తన చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేయడంతో అప్పట్లో ఆ నటికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అందులో ఆమెను త్రివర్ణ పతాకం కప్పి ఉంచారు. షారుఖ్ ఖాన్ 2011లో, ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధించిన సందర్భంగా.. భారత జాతీయ జెండాను ఎగురవేశాడు. అతను దాన్ని తలక్రిందులుగా పట్టుకున్నాడని ఆరోపణలు రావడంతో అతనిపై కేసు కూడా నమోదైనట్టు సమాచారం. ప్రపంచ కప్ మ్యాచ్‌లలో ఒకదానిలో, ప్రీతి జింటా జాతీయ జెండా రంగులతో చేతి ఫ్యాన్‌(hand fan)తో కనిపించింది. దీనిపై అభిమానులు తీవ్ర స్థాయిలో స్పందించారు.

Tags

Read MoreRead Less
Next Story