సినిమా

Shivani Rajasekhar: చెల్లి నిర్మాత.. తల్లి దర్శకత్వం.. తండ్రి పక్కన కూతురి పాత్ర.. వాట్ ఏ కాంబినేషన్..

Shivani Rajasekhar: రాజశేఖర్ కూతుళ్లు శివానీ, శివాత్మిక హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Shivani Rajasekhar: చెల్లి నిర్మాత.. తల్లి దర్శకత్వం.. తండ్రి పక్కన కూతురి పాత్ర.. వాట్ ఏ కాంబినేషన్..
X

Shivani Rajasekhar: చాలావరకు కుటుంబాలలో ఒకరు హీరో అయితే.. ఇంకొకరు కూడా వచ్చి సినీ పరిశ్రమలోనే స్థిరపడిపోతారు. అలా ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. అందులో ఒకటి రాజశేఖర్ ఫ్యామిలీ. ప్రస్తుతం రాజశేఖర్ ఫ్యామిలీ అంతా సినిమా ఇండస్ట్రీలోనే సెటిల్ అయిపోయారు. ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న జీవిత కూడా మళ్లీ దర్శకురాలిగా రీ ఎంట్రీ ఇస్తోంది.

రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు శివానీ, శివాత్మిక ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌లో హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముందుగా చెల్లి శివాత్మిక 'దొరసాని' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పటికీ తన నుండి మరో సినిమా రాలేదు. కానీ తన తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అక్క శివానీ మాత్రం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది.

ఇప్పటికే శివానీ రాజశేఖర్ నటించిన రెండు చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యి పరవాలేదనిపించుకున్నాయి. అయితే తన మూడో చిత్రం తన తండ్రి రాజశేఖర్‌తోనే చేస్తుంది శివానీ. రాజశేఖర్ హీరోగా నటిస్తున్న 'శేఖర్' చిత్రంలో ఆయన కూతురి పాత్ర పోషిస్తుంది శివానీ. ఈ చిత్రాన్ని తన చెల్లి శివాత్మిక నిర్మిస్తుండగా.. జీవితా రాజశేఖర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో వీరిద్దరి ఫస్ట్ లుక్‌ను ఇటీవల విడుదల చేసింది మూవీ టీమ్.

శేఖర్ ఫస్ట్ లుక్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన శివానీ.. 'చెల్లి నిర్మాతగా, అమ్మ దర్శకత్వంలో వస్తున్న మా శేఖర్ మూవీలో నాన్న పక్కన ఆయన కూతురిగా నటిస్తున్నా. ఇంతకంటే ఏం అడగగలను' అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ ఫస్ట్ లుక్ విడుదలయిన కాసేపట్లోనే సోషల్ మీడియా అంతా వైరల్‌గా మారింది. ఇక ఇటీవల శివానీ రాజశేఖర్ తమిళంలో కూడా హీరోయిన్‌గా అడుగుపెట్టి హిట్ కొట్టింది.


Next Story

RELATED STORIES