సినిమా

Shruti Haasan: అలా చేస్తే నా బాయ్‌ఫ్రెండ్‌ను అవమానించినట్టే కదా: శృతి హాసన్

Shruti Haasan: సినిమావారు ఏం చేసినా సెన్సేషనే.. వారి పర్సనల్ లైఫ్‌లో ఏం జరిగినా అదొక బ్రేకింగ్ న్యూసే.

Shruti Haasan (tv5news.in)
X

Shruti Haasan (tv5news.in)

Shruti Haasan: సినిమావారు ఏం చేసినా సెన్సేషనే.. వారి పర్సనల్ లైఫ్‌లో ఏం జరిగినా అదొక బ్రేకింగ్ న్యూసే.. ముఖ్యంగా వారి రిలేషన్‌షిప్స్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపికే.. అలాంటి ఎంతోమంది హీరోయిన్స్‌లో ఒకరు శృతి హాసన్. తన ప్రొఫెషనల్ లైఫ్ గురించే కాదు పర్సనల్ లైఫ్ కూడా శృతి ఎప్పుడూ ఏది దాచిపెపట్టకుండా తన ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. తాజాగా తన రిలేషన్‌షిప్ గురించి తాను చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

శృతి ఇప్పటివరకు ఎవరితో రిలేషన్‌లో ఉన్నా.. అది ప్రేక్షకుల నుండి పెద్దగా దాచిపెట్టదు. తాను ఫలానా వారితో రిలేషన్‌లో ఉన్నానంటూ ఓపెన్‌గా స్టేటస్‌లు పెట్టేస్తుంది. ప్రస్తుతం తాను శాంతను హజారికా అనే ఆర్టిస్ట్‌తో రిలేషన్‌లో ఉంది. అంతే కాదు వీరిద్దరి సహజీవనం కూడా చేస్తున్నారు. ఇవేవి పుకార్లు కావు.. శృతి హాసనే స్వయంగా బయటపెట్టన నిజాలు

శాంతను కంటే ముందు ఒక ఫారిన్ నటుడిని ప్రేమించింది శృతి హాసన్. తనను పెళ్లి కూడా చేసుకుంటుంది అన్న వార్తలు కూడా వచ్చాయి. తన కోసం శృతి కొంతకాలం యాక్టింగ్ కెరీర్‌నే పక్కన పెట్టేసింది. కానీ ఏమైందో తెలియదు ఒక్కసారిగా తన బ్రేకప్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత కొంతకాలం శృతి పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా వార్తలు రాలేదు.

అప్పుడైనా.. ఇప్పడైనా.. శృతి తన పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా సీక్రెట్ ఏమీ మెయింటేయిన్ చేయదు. ఇలా మీ బాయ్ ఫ్రెండ్స్ గురించి ఓపెన్‌గా చెప్పడం వల్ల మీకేం ఇబ్బందిగా అనిపించదా అని ఒక అభిమాని అడగగా.. 'ఈ విషయాన్ని దాస్తే నా బాయ్‌ఫ్రెండ్‌ను అవమానించినట్టే కదా.. అయినా నేను రిలేషన్‌లో ఉన్నప్పుడు సింగిల్ అని చెప్పాల్సిన అవసరం ఏముంది' అంటూ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది.

Next Story

RELATED STORIES