సినిమా

Shruti Haasan : కాస్త లేట్ అయింది కానీ.. బంపరాఫర్ కొట్టేసిన శృతిహాసన్

Shruti Haasan : హీరోయిన్ శృతహాసన్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అవకాశం అందుకుంది ఈ బ్యూటీ..

Shruti Haasan : కాస్త లేట్ అయింది కానీ..  బంపరాఫర్ కొట్టేసిన శృతిహాసన్
X

Shruti Haasan: హీరోయిన్ శృతహాసన్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అవకాశం అందుకుంది ఈ బ్యూటీ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు చిరు.. అందులో భాగంగానే యంగ్ డైరెక్టర్ బాబీ చెప్పిన కథకి ఓకే చెప్పారు చిరు.. ఈ సినిమాకి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్‌‌‌ని అనుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది.

మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం గ్రాండ్‌‌‌గా లాంచ్ అయి షూటింగ్ కూడా మొదలైంది.. ఈ సినిమాని త్వరగా ఫినిష్ చేయాలనీ చిరు భావిస్తున్నారు. అయితే ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా శృతహాసన్ కి మేకర్స్ ఫైనల్ చేశారట.. ఆమెకి కూడా కథ, పాత్ర నచ్చడంతో ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో మొదలుకానున్న రెండో షెడ్యుల్‌‌‌లో ఆమె పాల్గొననుందని తెలుస్తోంది.

కాగా మెగాస్టార్ పక్కన నటించే అవకాశం రావడంతో ఈ భామ ఫుల్ ఖుషిలో ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకు మెగా కాంపౌండ్‌‌‌లో స్టార్ హీరోలందరితోనూ శృతిహాసన్ నటించింది. ప్రస్తుతం ఆమె ప్రస్తుతం ప్రభాస్‌‌‌తో సలార్, బాలకృష్ణతో ఓ సినిమా చేస్తోంది. అటు చిరంజీవి ఆచార్య మూవీని ఫినిష్ చేశారు.

Next Story

RELATED STORIES