సినిమా

Shruti Haasan: తండ్రి స్థానంలో కూతురు.. ఆ లోటు తీర్చేనా..?

Shruti Haasan: సీనియర్ హీరో కమల్ హాసన్ ఇటీవల కరోనా లక్షణాలు ఉన్నాయంటూ హాస్పిటల్‌లో ఐసోలేషన్‌లో చేరనున్నట్టు ప్రకటించారు.

Shruti Haasan (tv5news.in)
X

Shruti Haasan (tv5news.in)

Shruti Haasan: సీనియర్ హీరో కమల్ హాసన్ ఇటీవల కరోనా లక్షణాలు ఉన్నాయంటూ హాస్పిటల్‌లో ఐసోలేషన్‌లో చేరనున్నట్టు ప్రకటించారు. దీంతో ఆయన తొందరగా కోలుకోవాలని అభిమానులు కోరుకోవడం మొదలుపెట్టారు. కరోనా కారణంగా ఆయన తరువాతి సినిమాలన్నింటికి కొన్నిరోజులు బ్రేక్ పడనుంది. మరి ఆయన హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ పరిస్థితి ఏంటి అని అందరూ అయోమయంలో పడ్డారు.

బిగ్ బాస్ షోలో వీక్ డేస్‌కంటే వీకెండ్స్‌లోనే ఎక్కువ రేటంగ్ వస్తుంది. దానికి కారణం హోస్ట్‌లు. వీక్ డేస్‌లో కంటెస్టెంట్స్ చేసే అల్లరి ప్రేక్షకులకు నచ్చినా.. నచ్చకపోయినా.. వీకెండ్స్‌లో హోస్ట్ చేసే సందడి కోసం మాత్రం బిగ్ బాస్ లవర్స్ ఎదురుచూస్తారు. అందుకే హోస్ట్‌లలాగా వ్యవహరిస్తున్న వారు మిగతా ప్రాజెక్ట్స్‌ను పక్కన పెట్టి మరీ కచ్చితంగా బిగ్ బాస్ కోసం టైమ్ కేటాయిస్తారు.

హిందీలో బ్లాక్ బస్టర్ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్.. తెలుగు, తమిళంలో ఒకేసారి మొదలయ్యింది. తెలుగు లాగానే తమిళంలో కూడా ప్రస్తుతం ఐదవ సీజనే నడుస్తోంది. తెలుగులో ముందు రెండు సీజన్లకు ఎన్‌టీఆర్, నాని హోస్ట్‌లుగా వ్యవహరించారు. కానీ తమిళంలో బిగ్ బాస్ మొదలయినప్పటి నుండి కమల్ హాసనే వ్యాఖ్యతగా ఉన్నారు. కానీ తాజాగా కమల్‌కు కరోనా రావడం వల్ల ఆయన ప్లేస్‌లో కూతురు శృతి హాసన్ హోస్ట్‌గా రానుందని సమాచారం.

బిగ్ బాస్ సీజన్4లో కూడా ఒకసారి తన షూటింగ్ పని మీద అత్యవసరంగా ఫారిన్ వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఆయన స్థానాన్ని సమంత తీసుకుంది. హీరోయిన్‌గానే కాదు హోస్ట్‌గా కూడా సమంత పర్ఫెక్ట్ అని నిరూపించుకుంది. ప్రస్తుతం అలాగే కమల్ హాసన్ ప్లేస్‌లో శృతి హాసన్ రానుంది. ఇప్పటివరకు శృతికి కూడా హోస్ట్‌గా ఏ అనుభవం లేదు. అందుకే ఈ వార్త తెలిసినప్పటి నుండి శృతి ఫ్యాన్స్ తనను హోస్ట్‌గా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు.

Next Story

RELATED STORIES