Shweta Tiwari: దేవుడిపై నటి సంచలన వ్యాఖ్యలు.. కేసు నమోదు చేసిన పోలీసులు..

Shweta Tiwari (tv5news.in)

Shweta Tiwari (tv5news.in)

Shweta Tiwari: హిందీలోని పలు సీరియళ్లలో నటించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటి శ్వేతా తివారీ.

Shweta Tiwari: కొన్నిసార్లు సెలబ్రిటీలు ఆలోచించకుండా మాట్లాడే చిన్న చిన్న మాటలు కూడా పెద్ద కాంట్రవర్సీలకు దారితీస్తాయి. అలా కాంట్రవర్సీల్లో చిక్కుకుని కేసుల వరకు వెళ్లిన సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు. తాజాగా ఓ బాలీవుడ్ భామ దేవుడి మీదే కాంట్రవర్షియల్ స్టేట్‌మెంట్స్ చేసింది. దీంతో తనపై కేసు నమోదయ్యే వరకు వెళ్లింది విషయం.

హిందీలోని పలు సీరియళ్లలో నటించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటి శ్వేతా తివారీ. ఇప్పుడిప్పుడే శ్వేతా బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా మెరిసే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఇటీవల ఓ వెబ్ సిరీస్‌ను సైన్ చేసింది. ఆ సిరీస్ ప్రమోషన్స్ కోసం భోపాల్ వెళ్లిన శ్వేతా.. స్టేజ్‌పై మాట్లాడిన మాటలు పెద్ద దుమారాన్నే రేపాయి.

'నా లోదుస్తుల సైజు దేవుడే తీసుకుంటున్నాడు.' అంటూ బోల్డ్‌గా మాట్లాడింది శ్వేతా. దీంతో నెటిజన్లు తనపై ఫైర్ అవుతున్నారు. అది మాత్రమే కాదు.. మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా.. శ్వేతాపై ఫైర్ అవ్వడంతో పాటు దానిని ఆయన ఖండిస్తూ దర్యాప్తుకు అనుమతినిచ్చారు. అలా మాట్లాడినందుకు శ్వేతాపై ఐపీసీ సెక్షన్ 295ఏ కేసు కూడా నమోదు చేశారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story