సినిమా

Shyam Singha Roy: ఓటీటీలో 'శ్యామ్ సింగరాయ్'.. ఎప్పుడంటే..?

Shyam Singha Roy: నాని, సాయి పల్లవి జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’.

Shyam Singha Roy (tv5news.in)
X

Shyam Singha Roy (tv5news.in)

Shyam Singha Roy: నాని, సాయి పల్లవి జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. రాహుల్ సాంకిృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ టాక్ అందుకోవడంతో పాటు కలెక్షన్ల విషయంలో కూడా మంచి విజయాన్నే సాధించింది. అయితే డిసెంబర్ 24న థియేటర్లలో విడుదలయిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో సందడి చేయనుంది.

మామూలుగా సినిమా థియేటర్లలో విడుదలయిన 90 రోజుల వరకు ఓటీటీలో విడుదల చేయకూడదని సినీ నిర్మాణ సంస్థలు షరతును పెట్టాయి. కానీ అన్ని రోజుల వరకు సినిమాలు థియేటర్లలో కూడా ఉండే అవకాశం లేదని అనుకుంటున్నారో ఏమో.. ఒక్క పక్క మూవీ థియేటర్లలో ఉన్నా కూడా మరోపక్క ఓటీటీలో విడుదల చేసేస్తోంది మూవీ టీమ్.

అలాగే శ్యామ్ సింగరాయ్ విడుదలయ్యి ఒక నెల కూడా పూర్తవ్వకుండానే మూవీ ఓటీటీ విడుదల తేదీ బయటికి వచ్చేసింది. శ్యామ్ సింగరాయ్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. జనవరి 26న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుందని టాక్ వినిపిస్తోంది. తెలుగులో మాత్రమే కాదు తమిళంలో కూడా శ్యామ్ సింగరాయ్ ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుందని సమాచారం.

Next Story

RELATED STORIES