సినిమా

Shyam Singha Roy: 'శ్యామ్ సింగరాయ్' ట్రైలర్ విడుదల.. అందరికీ షాక్ ఇచ్చే పాత్రలో సాయి పల్లవి..

Shyam Singha Roy: ఇటీవల ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం నుండి ట్రైలర్ విడుదలయ్యింది.

Shyam Singha Roy (tv5news.in)
X

Shyam Singha Roy (tv5news.in)

Shyam Singha Roy: ఇప్పటివరకు నేచురల్ స్టార్ నాని ఇప్పటివరకు ఫీల్ గుడ్ సినిమాల్లో మాత్రమే నటిస్తూ.. పక్కింటి అబ్బాయి పాత్రల్లోనే కనిపించేవాడు. కానీ తన అప్‌కమింగ్ మూవీ 'శ్యామ్ సింగరాయ్'తో వీటన్నింటిని బ్రేక్ చేసి ప్రేక్షకులకు కొత్త నానిని చూపించనున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కావడం మరొక విశేషం. ఇటీవల ఈ చిత్రం నుండి ట్రైలర్ విడుదలయ్యింది.

నాని, కృతి శెట్టి, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్రలో మలయాళ భామ మడోనా సెబాస్టియన్ కనిపించనుంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమాను రాహుల్ సాంకిృత్యాన్ తెరకెక్కించాడు. డిసెంబర్ 24న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండగా ఇటీవల విడుదలయిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

1980ల్లో బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ చిత్రంలో సాయి పల్లవి దేవదాసినిగా కనిపించనుంది. ఎప్పుడూ సెలక్టివ్ కథలనే ఎంచుకునే సాయి పల్లవి.. ఈసారి ఇలాంటి దేవదాసిని పాత్రను ఎంచుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఇక రెండు షేడ్స్‌తో నాని కూడా ఎప్పటిలాగానే నేచురల్‌గా కనిపిస్తున్నాడు.

Next Story

RELATED STORIES