సినిమా

Siddharth: అప్పటివరకే యాక్టింగ్ చేస్తా.. లేదంటే: సిద్ధార్థ్

Siddharth: ప్రస్తుతం ‘ఎస్కేప్‌ లైవ్‌’ అనే హిందీ వెబ్ సిరీస్‌లో నటించాడు సిద్ధార్థ్.

Siddharth: అప్పటివరకే యాక్టింగ్ చేస్తా.. లేదంటే: సిద్ధార్థ్
X

Siddharth: ఒకప్పుడు చాక్లెట్ బాయ్ ఇమేజ్‌తో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు సిద్ధార్థ్. ప్రస్తుతం తన ప్రొఫెషనల్ విషయాలకు సంబంధించిన దానికంటే పర్సనల్ విషయాల వల్లే సిద్ధార్థ్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా సిద్ధార్థ్ మాట్లాడే కొన్ని మాటలు కాంట్రవర్సీకి దారితీస్తు్న్నాయి. తాజాగా తన కెరీర్ గురించి మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు సిద్ధార్థ్.

ఎన్నో ఏళ్లు లవర్ బాయ్‌గా, మినిమమ్ గ్యారెంటీ హీరోగా రాణించిన సిద్ధార్థ్.. అనుకోకుండా సినిమాల నుండి బ్రేక్ తీసుకున్నాడు. తను చేసే సినిమాల సంఖ్య చాలా తగ్గించేశాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన 'మహాసముద్రం'తో మరోసారి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సిద్ధు. ఆ సినిమా అంతగా కమర్షియల్‌గా మెప్పించలేకపోయినా.. సిద్ధుకు మాత్రం మంచి కమ్ బ్యాక్‌నే ఇచ్చింది.

ప్రస్తుతం 'ఎస్కేప్‌ లైవ్‌' అనే హిందీ వెబ్ సిరీస్‌లో నటించాడు సిద్ధార్థ్. ఈ సిరీస్ త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉండడంతో ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఈ ప్రమోషన్స్ సమయంలో సిద్ధు తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మంచి ఆఫర్లు వస్తే బాలీవుడ్‌కు తిరిగొస్తానని మాటిచ్చాడు సిద్ధార్థ్. ఢిపరెంట్‌ రోల్స్‌ వచ్చే వరకు యాక్టింగ్‌ చేస్తానని, లేదంటే వేరే ఉద్యోగం చూసుకుంటానని క్లారిటీ ఇచ్చేశాడు.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES