Ramya Behara : రమ్య బెహరా పేరుతో మోసం.. త్వరగానే అలెర్ట్ అయిన బాహుబలి సింగర్... !

Ramya Behara : రమ్య బెహరా పేరుతో మోసం.. త్వరగానే అలెర్ట్ అయిన బాహుబలి సింగర్... !
Ramya Behara : సోషల్ మీడియా వాడకం ఎక్కువయ్యాక మోసాలు బాగా పెరిగిపోతున్నాయి.

Ramya Behara : సోషల్ మీడియా వాడకం ఎక్కువయ్యాక మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. సెలబ్రిటీ పేర్లతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అమాయకులను కొందరు కేటుగాళ్ళు ఇట్టే మోసం చేస్తున్నారు. సరిగ్గా ఫీమేల్ సింగర్ రమ్య బెహరా విషయంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. తన పేరుతో ఎవరో ఫేక్ కాల్స్ చేస్తున్నారని, ఆ నంబర్‌ను స్క్రీన్ షాట్ చేస్తూ ఇది తనది కాదని తెలిపింది. దానికి రియాక్ట్ అవ్వోద్దని, వెంటనే బ్లాక్ చేయాలనీ కోరింది.

రమ్య బెహరా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. దీనితో తన పేరు పైన జరుగుతున్న మోసాలను వెంటనే పసిగట్టి అప్రమత్తం చేసింది. కాగా ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో ధీవర సాంగ్ తో ఒక్కసారిగా ఫేమస్ అయింది రమ్య బెహరా.. అంతకుముందు కూడా ఆమె చాలానే సాంగ్స్ పాడింది కానీ ఫేం అయితే రాలేదు.. ఇక స్వరాభిషేకం ప్రోగ్రాంలో ఈమె పాడే పాటలకి చాలానే మంది ఫ్యాన్స్ ఉన్నారు.



Tags

Read MoreRead Less
Next Story