బాలు ఇలా చేస్తే సినిమా హండ్రెడ్ డేస్ ఆడినట్లే
బాలు పాడితే ఆ పాటకు తిరుగుండదు. ఆ సాంగ్స్ అన్నీ హిట్టే. అప్పట్లో ముందుగా ఆడియో రిలీజ్ బాలు ఇలా చేస్తే సినిమా హండ్రెడ్ డేస్ ఆడినట్లే.. బాలు ఇలా చేస్తే సినిమా హండ్రెడ్ డేస్ ఆడినట్లే..

బాలు పాడితే ఆ పాటకు తిరుగుండదు. ఆ సాంగ్స్ అన్నీ హిట్టే. అప్పట్లో ముందుగా ఆడియో రిలీజ్ చేసేవారు. పాటలు హిట్టయితే సినిమా హండ్రెడ్ డేస్ ఆడినట్లే. అదీ బాలసుబ్రహ్మణ్యంపై సినీ నిర్మాతలు, దర్శకులు, హీరోలకు ఉన్న నమ్మకం. అది కేవలం నమ్మకం కాదు. నిజం. అందుకే ఎంత మంది సింగర్లు వచ్చినా బాలు స్థానం బాలుదే. ఆయనకు ఎవరూ ప్రత్యామ్నాయం కాలేకపోయారు. ప్రతీపాట వినూత్నంగా అనిపించేలా పాడడం బాలుకే సాధ్యమైందని చెప్పొచ్చు.
ఎన్టీఆర్‌కు ఒరబ్బీ అనే మాస్ బీట్ సాంగ్ పాడిన బాలు
ఎన్టీఆర్ లాంటి మహానటుడికి మాస్ బీట్ సాంగ్ పాడినా అది బాలుకే చెల్లింది. హిందీ డాన్ సినిమాను.. తెలుగులో యుగంధర్‌గా తీశారు. హిందీలో సూపర్‌స్టార్ అమితాబ్ హీరో అయితే.. తెలుగులో ఎన్టీఆర్ ఆ పాత్రను సమర్థవంతంగా పోషించారు. అయితే అందులో సూపర్ హిట్ అయిన పాన్ సాంగ్ దగ్గరే వచ్చింది చిక్కంతా. కిషోర్ కుమార్ పాడిన ఆ పాట ఎవరు పాడతారనే ప్రశ్న వచ్చినప్పుడు అందరికీ గుర్తొచ్చింది ఒక్క బాలూ మాత్రమే...
బాలుకు స్వరం దేవుడిచ్చిన వరం
తన గాత్రంతో రకరకాల ధ్వనులను పలికించిన బాలు
బాలుకు స్వరం దేవుడిచ్చిన వరం. ఆ స్వరంతో ఆయన సంగీతంలో చేయని ప్రయోగం లేదంటే అతిశయోక్తికాదు. తన గాత్రంతో పాట పాడడమే కాదు... రకరకాల ధ్వనులను కూడా పలికించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. అంతులేని కథ చిత్రంలో తాళికట్టు శుభవేళ పాటనే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్...
పదహారేళ్ల వయసు సినిమాలో బాలు పాడిన కట్టుకథలు చెప్పినేను కవ్విస్తే అనే పాట అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది. హీరోగా నటించిన చంద్రమోహనే ఈ పాట పడినట్లు అనిపిస్తుంది. అదీ బాలు స్వరం మహిమ...
బాలు పాటకు వయసుతో సంబంధం లేదు
బాలు పాటకు వయసుతో సంబంధం లేదు. అచ్చు అల్లురామలింగయ్య పాడినట్లు పాడడం ఒక్క బాలుకే సాధ్యమైంది. మనుషులంతా ఒకటే చిత్రంలో ముత్యాలు వస్తావా అనే రొమాంటిక్ సాంగ్ బాగా పాపులరైంది...
బాలు చేసిన సంగీత ప్రయోగాల్లో ఒకటి చరణ కింకిణులు పాట
చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన... కర కంకణములు గల గల లాడగా అంటూ ఎస్పీ తన గొంతులో పలికించిన గమకాలు సంగీతాభిమానుల మదిలో పదిలమైపోయాయి. చెల్లెలి కాపురం చిత్రంలోని ఈ పాట బాలు గాత్ర సామర్థ్యానికి ప్రతీకగా నిలిచిపోయింది...
విరహం, విషాదం, హ్యాపీ సాంగ్స్‌తోపాటు ప్రేమ పాటల్లోనూ బాలు ప్రయోగాలు చేశారు. గుణ చిత్రంలో కమ్మని నీ ప్రేమ లేఖలే పాటపై కమల్ హాసన్ హావభావాలకు బాలు స్వరం అచ్చుగుద్దినట్లు సరిపోయింది. దీంతో ప్రేక్షకులకు ఈ పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది...
రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది బాలు స్వరం
అల్లరి మొగుడు చిత్రంలో ఒకేసారి రెండు వేరియేషన్స్‌లో పాట
బాలు స్వరం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. ఒకేసారి రెండు భిన్న స్వరాలు వినిపించడం బాలసుబ్రహ్మణ్యంకే సాధ్యమైంది. అల్లరి మొగుడు చిత్రంలో నాపాట పంచామృతం అనే పాటనే ఇందుకు ఉదాహరణ. వృద్ధుడు, యువకుడు సంగీతంలో పోటీపడితే ఎలా ఉంటుందో ఒకే సారి రెండు వేర్వేరు మాడ్యులేషన్‌లో పాటపాడి అబ్బురపరిచారు బాలు. ఎంతో కష్టసాధ్యమైన ఈ వేరియేషన్‌ను ఆయన తక్కువ సమయంలో రికార్డింగ్ పూర్తి చేయడం విమర్శకుల ప్రశంసలను అందుకుంది.. ఈ ప్రయోగాలు మచ్చుకు కొన్ని మాత్రమే. బాలు నోటి నుంచి వచ్చిన ప్రతి పాట పంచామృతమే. గాయకుడిగా ఆయన స్వరరాగ ప్రవాహం సంగీతప్రియులకు నిజంగా వరమే.
RELATED STORIES
Drone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్...
17 May 2022 5:30 AM GMTFCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వాచ్ మెన్ నుండి...
16 May 2022 4:30 AM GMTBihar : బీహార్ సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!
15 May 2022 3:15 PM GMTIOCL recruitment 2022 : ఇంజినీరింగ్ అర్హతతో ఐఓసీఎల్ లో ఉద్యోగాలు.....
14 May 2022 4:30 AM GMTSSC Phase X Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర...
13 May 2022 4:45 AM GMTIndia Post Payments Bank(IPPB) GDS Recruitment 2022: డిగ్రీ అర్హతతో ...
12 May 2022 4:30 AM GMT