సినిమా

shrihan : సిరి బాయ్‌ఫ్రెండ్‌‌‌కి బంపరాఫర్..!

shrihan : ఈ క్రమంలో సిరి, శ్రీహన్ కూడా విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా హాల్‌‌చల్ చేశాయి. కానీ దీనిపైన వీరిద్దరూ ఇంతవరకు స్పందించలేదు.

shrihan : సిరి బాయ్‌ఫ్రెండ్‌‌‌కి బంపరాఫర్..!
X

shrihan : ఇటీవల బిగ్‌‌‌బాస్ సీజన్ 5 ముగిసింది.. ఈ సీజన్‌‌లో విజేతగా నిలిచేందుకు చివరివరకు ప్రయత్నించాడు యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్.. కానీ చివరికి రన్నరప్‌‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదే అతనికి నిరాశనే మిగిల్చింది. ఈ క్రమంలోనే షణ్ముఖ్‌‌కి ఊహించని మరో షాక్ తగిలింది. షణ్నూకి బ్రేకప్ చెప్పేసింది దీప్తి సునయన. తమ అయిదేళ్ళ ప్రేమ బంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు వీరిద్దరూ..

ఈ క్రమంలో సిరి, శ్రీహన్ కూడా విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా హాల్‌‌చల్ చేశాయి. కానీ దీనిపైన వీరిద్దరూ ఇంతవరకు స్పందించలేదు. బిగ్‌‌బాస్ 5 షోలో సిరి షణ్ముఖ్ సన్నిహితంగా ఉన్నప్పుటి నుంచి ఆమె బాయ్‌ఫ్రెండ్‌‌‌ శ్రీహన్ కూడా ట్రెండింగ్‌లో ఉన్నాడు.. ఇప్పుడు కూడా అతని గురించి నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలో శ్రీహన్ కి బంపరాఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. త్వరలో ఓటీటీ వేదికగా బిగ్‌‌బాస్ మొదలు కానుంది. దీనికి కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ చేయనున్నాడు. దీనికోసం నిర్వహకులు కంటెస్టెంట్‌‌ల కోసం వేట మొదలుపెట్టారు. అందులో భాగంగానే శ్రీహన్‌‌‌‌ని వారు సంప్రదించినట్టుగా తెలుస్తోంది. దీనికి శ్రీహన్ కూడా ఒకే చెప్పాడట.

మరి వచ్చిన ఈ ఆఫర్‌‌ని అతను ఎలా వాడుకోబోతున్నాడు.. అతనికి సిరి ఏ విధమైన సపోర్ట్ అందిస్తుంది అన్నది చూడాలి. కాగా శ్రీహన్‌‌‌‌ను కూడా నటుడే అన్న సంగతి తెలిసిందే.

Next Story

RELATED STORIES