Sirivennela Seetharama Sastry : సీతారామశాస్త్రికి ఛాన్స్ ఇచ్చింది విశ్వనాథ్‌ అయితే గుర్తించింది ఎవరు?

Sirivennela Seetharama Sastry : సీతారామశాస్త్రికి ఛాన్స్ ఇచ్చింది విశ్వనాథ్‌ అయితే గుర్తించింది ఎవరు?
సీతారామశాస్త్రిలో కవి ఉన్నాడని గుర్తించిన మొదటి వ్యక్తి ఆయన సోదరుడు. చిన్నప్పటి నుంచి సీతారామశాస్త్రికి పాటలు పాడాలని కోరిక. ఒకట్రెండుసార్లు ప్రయత్నించి, అందుకు తాను పనికిరానని నిర్ధారణకు వచ్చారు

సీతారామశాస్త్రిలో కవి ఉన్నాడని గుర్తించిన మొదటి వ్యక్తి ఆయన సోదరుడు. చిన్నప్పటి నుంచి సీతారామశాస్త్రికి పాటలు పాడాలని కోరిక. ఒకట్రెండుసార్లు ప్రయత్నించి, అందుకు తాను పనికిరానని నిర్ధారణకు వచ్చారు. అయితే, కొత్త పదాలతో ఎప్పుడూ ఏదో ఒకటి పాడుతుండటాన్ని చూసిన ఆయన సోదరుడు... అన్నయ్యా కవిత్వం కూడా బాగా రాస్తున్నావు ప్రయత్నించు అని చెప్పారట.

ఆ తర్వాత ఏవీ కృష్ణారావు, సహచరుడు చాగంటి శరత్‌బాబుతో కలిసి సాహితీ సభలకు వెళ్లేవారు సిరివెన్నెల. ఆ సమయంలో సీతారామశాస్త్రిని అందరూ భరణి అని పిలిచేవారు. MA చేస్తుండగా దర్శకుడు కె.విశ్వనాథ్‌ నుంచి పిలుపు రావటంతో 'సిరివెన్నెల' చిత్రానికి తొలిసారి కలాన్ని కదిలించారు. అలా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే సుమధుర గీతాలెన్నింటినో రాశారు.

సీతారామశాస్త్రి తెలుగు సినిమాకు రాసిన మొదటి పాట 'విధాత తలపున'. 'సిరివెన్నెల' సినిమాలోని పాటకు ఉత్తమ గీత రచయితగా తొలిసారి నంది అవార్డు అందుకున్నారు. రెండోసారి కూడా కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమాకే ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు అందుకున్నారు సీతారామశాస్త్రి. ఇక ముచ్చటగా మూడోసారి కె.విశ్వనాథ్‌ డైరెక్ట్‌ చేసిన సినిమాలోని పాటకే నందిఅవార్డు సీతారామశాస్త్రిని వరించింది.

Tags

Read MoreRead Less
Next Story