సినిమా

Sirivennela Seetharama Sastry :కృష్ణవంశీని కొడుకుగా దత్తత.. త్రివిక్రమ్‌‌‌‌ని అల్లున్ని చేసుకున్న సీతారామశాస్త్రి.. !

Sirivennela Seetharama Sastry : నాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ వినీలాకాశంలో సిరివెన్నెల కురిపించిన ఆ కలం ఆగిపోయింది.

Sirivennela Seetharama Sastry :కృష్ణవంశీని కొడుకుగా దత్తత.. త్రివిక్రమ్‌‌‌‌ని అల్లున్ని చేసుకున్న సీతారామశాస్త్రి.. !
X

Sirivennela Seetharama Sastry : నాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ వినీలాకాశంలో సిరివెన్నెల కురిపించిన ఆ కలం ఆగిపోయింది.. తెలుగు పదాన్ని అనాథను చేసి వసంతం వెళ్లిపోయింది.. తెలుగు సినీ పరిశ్రమలో అంతులేని విషాదాన్ని నింపి వెళ్లిపోయారు సిరివెన్నెల సీతారామశాస్త్రీ.. న్యూమోనియాతో బాధపడుతూ ఈనెల 24న కిమ్స్‌లో చేరిన సీతారామశాస్త్రీ.. ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సిరివెన్నెల మృతితో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.

దాదాపుగా 160కి పైగా సినిమాలలో మూడు వేలకి పైగా పాటలు రాశారు సీతారామశాస్త్రీ.. అందులో దేనికదే ప్రత్యేకం. ఆయనతో పాటలు రాయించుకున్న దర్శకులలో ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కృష్ణవంశీ సినిమాలో సీన్స్ మాత్రమే కాదు పాటలు కూడా అంతే ఎమోషనల్‌‌‌గా ఉంటాయి. అందుకే తన మొదటి సినిమా గులాబీ నుంచే సీతారామశాస్త్రీతో పాటలు రాయించుకున్నారు కృష్ణవంశీ.

ఆ సినిమాలోని అన్నీ పాటలు సీతారామశాస్త్రీనే రాశారు. అక్కడినుంచి ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది. ఆ తర్వాత కృష్ణవంశీ సినిమాలో సీతారామశాస్త్రీ పాట ఒక్కటైనా కచ్చితంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అదే సినిమాకి మెయిన్ సోల్ సాంగ్‌‌‌గా నిలుస్తుంది. కృష్ణవంశీ అంటే సీతారామశాస్త్రీకి చాలా ఇష్టం.. ఎంతలా అంటే ఏకంగా కొడుకుగా దత్తత తీసుకొని తన ప్రేమని తెలిపారు సీతారామశాస్త్రీ.

ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే.. ఇండస్ట్రీకి రాకముందు నుంచే సీతారామశాస్త్రీని ఓ గురువులగా భావించారు త్రివిక్రమ్.. సీతారామశాస్త్రీ రాసే పాటలకి అర్ధాలు వెతుక్కునేవారు. అంతాలా ఆయనని ఆరాధించడం మొదలుపెట్టాడు త్రివిక్రమ్. రచయితగా అవకాశం దొరికిన ప్రతిసారి సీతారామశాస్త్రీతో పాటలు రాయించుకున్నారు. డైరెక్టర్‌‌‌గా మారిన తర్వాత నువ్వే నువ్వే చిత్రంలో అన్ని పాటలు ఆయనతోనే రాయించుకున్నారు.

అలా త్రివిక్రమ్‌‌తో సీతారామశాస్త్రీకి మంచి రిలేషన్ ఏర్పడింది. అది ఎలా అంటే అల్లున్ని చేసుకునేంత.. సీతారామశాస్త్రీ సోదరుడి పెద్దకూతురిని పెళ్లి చూపులు చూసేందుకు వచ్చిన త్రివిక్రమ్‌‌కి ఆమె చెల్లి సౌజన్య నచ్చింది. ఇదే విషయాన్ని అందరి ముందు చెప్పాడట త్రివిక్రమ్. అయితే అబ్బాయి మంచి వాడు కావడం పైగా సీతారామశాస్త్రీకి నచ్చిన వాడు కావడంతో సౌజన్యతో త్రివిక్రమ్ పెళ్లికి ఒకే అనేశారు.

Next Story

RELATED STORIES