సినిమా

Sivasankar Master: శివశంకర్ మాస్టర్ జాతకం గురించి ఆయన తండ్రికి ముందే తెలుసు..

Sivasankar Master: ఇప్పుడు సోషల్ మీడియా సహాయంతో మనకు ఏ విషయమైనా వెంటనే తెలిసిపోతోంది.

Sivasankar Master (tv5news.in)
X

Sivasankar Master (tv5news.in)

Sivasankar Master: ఇప్పుడు సోషల్ మీడియా సహాయంతో మనకు ఏ విషయమైనా వెంటనే తెలిసిపోతోంది. అలా నటీనటులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటీనటులకు ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ ఒకప్పుడు సోషల్ మీడియా అనేది లేకపోయినా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న స్టార్స్ కూడా ఉన్నారు. వారిలో ఒకరు శివశంకర్ మాస్టర్.

ప్రస్తుతం ఒక హీరోకు ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలుసుకోవాలన్నా, ఒక సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ కావాలన్నా.. అయితే గూగుల్.. లేదా ఇన్‌స్టాగ్రామ్.. కావాల్సిన సమాచారమంతా చిటికెలో మన ముందు ఉంటుంది. కానీ అలాంటివి ఏమీ లేని సమయంలో కూడా ఒక పాటను తెరపై చూడగానే ఇది కంపోజ్ చేసింది శివశంకర్ మాస్టరే అని తెలిసేలా ఉండేది ఆయన మార్క్.

శివశంకర్ మాస్టర్ తండ్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థలో ఆయన తండ్రి సభ్యడు. అందుకే చాలా చిన్న వయసు నుండే మాస్టర్‌కు సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లే అలవాటు ఏర్పడింది. అలాగే డ్యాన్స్ మీద ఇష్టం కూడా ఏర్పడింది. 16 ఏళ్లు వచ్చేసరికే తనంతట తాను డ్యాన్స్ నేర్చుకుని స్టేజ్ పర్ఫార్మెన్స్‌లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది తండ్రికి అస్సలు నచ్చక మాస్టర్ భవిష్యత్తు ఏంటో తెలుసుకోవడానికి జాతకం చూపించారు. ఎంతమందికి ఆయన జాతకం చూపించినా.. ఆయన డ్యాన్సర్ అవుతారనే చెప్పేవారట.

తండ్రి ఒప్పుకోవడంతో మద్రాసులోని నటరాజ శకుంతల అనే నృత్యకారుడి దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నారు. దాదాపు పది సంవత్సరాలు ఎన్నో రకాల విద్యలను నేర్చుకున్నారు. ఆడవాళ్లు పలికించే హావభావాలపై దృష్టిపెట్టారు. డ్యాన్స్‌లో నైపుణ్యం తెచ్చుకున్న తర్వాత సినీ పరిశ్రమలో పనిచేస్తున్న సలీమ్‌ అనే డ్యాన్స్ మాస్టర్‌కు అసిస్టెంట్‌లాగా చేరి కెరీర్‌ను ప్రారంభించారు.

మెల్లగా డ్యాన్స్ మాస్టర్‌గా ఆయనకు ఇండస్ట్రీలో గుర్తింపు రావడం మొదలయింది. రొమాంటిక్ సాంగ్ అయినా.. మాస్ సాంగ్ అయినా.. భక్తి పాట అయినా.. మాస్టర్ తమ మార్క్‌ను చూపించారు. 'మగధీర' సినిమా ఆయన కంపోజ్ చేసిన ధీర ధీర్ పాటకు జాతీయ అవార్డును అందుకున్నారు. అంతే కాక 'రాజు గారి గది 3' లాంటి సినిమాలో కీలక పాత్ర పోషించి నటుడిగా కూడా మెప్పించారు. ఎన్నో డ్యాన్స్ రియాలిటీ షోల ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

Next Story

RELATED STORIES