సినిమా

బాలీవుడ్ పొమ్మంది.. కోలీవుడ్ రమ్మంటోందా..?

అలా ఇప్పుడు తమిళ్ సూపర్ స్టార్ విజయ్ కోసం కూడా ఓ కొత్త భామను తీసుకోవాలనుకుంటున్నారట.

బాలీవుడ్ పొమ్మంది.. కోలీవుడ్ రమ్మంటోందా..?
X

కొత్త కాంబినేషన్స్ సెట్ చేయాలని ప్రతి మేకర్ అనుకుంటాడు. ముఖ్యంగా స్టార్ హీరోల సరసన రెగ్యులర్ హీరోయిన్ల కంటే వేరే వారైతే కాంబో ఫ్రెష్ ఉంటుందని భావిస్తుంటారు. అందుకే అన్ని సినిమాలకూ కాకపోయినా మాగ్జిమం స్టార్ హీరోలే కొత్తవాళ్లతో ఎక్కువగా వర్క్ చేస్తుంటారు. అలా ఇప్పుడు తమిళ్ సూపర్ స్టార్ విజయ్ కోసం కూడా ఓ కొత్త భామను తీసుకోవాలనుకుంటున్నారట. ఈ ముక్క తెలిసిన దగ్గర్నుంచి సదరు బ్యూటీ కూడా ముంబై నుంచి పావులు కదుపుతోందంటున్నారు.

బాలీవుడ్ లో నెపోటిజం కమెంట్స్ ఎప్పుడూ ఫేస్ చేసే భామల్లో సోనమ్ కపూర్ ఒకరు. అనిల్ కపూర్ కూతురుగా వచ్చిన ఈ భామ తర్వాత తనదైన ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేసింది. కానీ సక్సెస్ రేట్ తక్కువగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. దీంతో సడెన్ గా పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత బాలీవుడ్ ను వదలకుండా సినిమాలు చేస్తూనే ఉంది. అయినా హిట్లు పడటం లేదు.

కాకపోతే హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఎప్పుడూ అభిమానుల్ని అలరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే అమ్మడికి సౌత్ నుంచి ఓ కొత్త ఛాన్స్ రాబోతోందనే వార్తలు కోలీవుడ్ లో షికార్లు చేస్తున్నాయి.

వరుస విజయాలతో దూసుకుపోతోన్న ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో ఒకటి ఆల్రెడీ సెట్స్ పై ఉంది. మరో రెండు సినిమాల్లో ఒకటి వంశీ పైడిపల్లితో ఉంటుంది. మరొకటి లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఉంటుంది. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒక మూవీలో సోనమ్ ను తీసుకోవాలనుకుంటున్నారట. ఆల్రెడీ సోనమ్ హిందీలో ధనుష్ సరసన రాంఝనా అనే హిట్ మూవీ చేసింది. ఇది తమిళ్ లోనూ డబ్ అయింది. ఆ రకంగా అక్కడి ఆడియన్స్‌కు ఆమె ముందే తెలుసు. ఇక విజయ్ సినిమా తెలుగులోనూ డబ్ అవుతుంది కాబట్టి.. సోనమ్ తెలుగు వారికీ పరిచయం కావొచ్చు. కాకపోతే ఆ రెండు సినిమాల్లో ఏ మూవీలో ఆమె ఉంటుందనేది ఇంకా తేలాల్సి ఉంది.

Next Story

RELATED STORIES