సినిమా

Soundarya Rajinikanth : కరోనా బాధితుల కోసం సౌందర్య రజనీకాంత్‌ రూ. కోటి విరాళం..!

సౌందర్య రజనీకాంత్ తన భర్త విశాగన్ వనంగముడితో కలిసి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కలిసి కోటి రూపాయల చెక్కును అందించారు.

Soundarya Rajinikanth : కరోనా బాధితుల కోసం సౌందర్య రజనీకాంత్‌ రూ. కోటి విరాళం..!
X

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వేలాదిమంది మృత్యువాత పడుతున్నారు. కరోనా బాధితులను రక్షించేందుకు ప్రభుత్వాలు, వైద్య సిబ్బంది తీవ్ర కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు తమిళ సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే హీరోలు కార్తి,సూర్య కోటి రూపాయల విరాళం ఇవ్వగా... అజిత్ 25 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ తన భర్త విశాగన్ వనంగముడితో కలిసి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కలిసి కోటి రూపాయల చెక్కును అందించారు. కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన స్టాలిన్ కి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.


Next Story

RELATED STORIES