Raja Movie: 'రాజా' సినిమాను వదులుకున్న స్టార్ హీరోయిన్.. మన తెలుగమ్మాయే..

Raja Movie (tv5news.in)

Raja Movie (tv5news.in)

Raja Movie: సినీ పరిశ్రమలో ఏ కథ ఎవరి చేతికి వెళ్తుందో.. ఎవ్వరం చెప్పలేం.

Raja Movie: సినీ పరిశ్రమలో ఏ కథ ఎవరి చేతికి వెళ్తుందో.. అది ఎవరి నుండి ఎవరికి వచ్చి బ్లాక్‌బస్టర్‌ను అందిస్తుందో ఎవ్వరం చెప్పలేం. కథ మన చేతిలో ఉన్నంతవరకు సినిమా ఆడదేమో అనుకుని.. సూపర్ హిట్ అయ్యాక బాధపడిన నటీనటులు కూడా ఉన్నారు. ఇదంతా ఇండస్ట్రీలో చాలా కామన్. కథాపరంగానే కాకుండా డేట్లు కుదరక కొన్ని మంచి కథలను వదిలేసుకున్న నటీనటులు కూడా ఉన్నారు. 1999లో విడుదలయిన వెంకటేశ్‌ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిన 'రాజా'లో హీరోయిన్ కూడా మొదట సౌందర్య కాదట.

ఫీల్ గుడ్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు రాజా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సింపుల్‌గా అనిపించే కథ, అందులో మనసుకు హత్తుకునే పాటలు, ఇప్పటికీ రిఫ్రెషింగ్‌గా అనిపించే మ్యూజిక్.. ఇవన్నీ ఈ సినిమాకు హైలైట్. ఈ సినిమాతోనే వెంకటేశ్, సౌందర్యల కెమిస్ట్రీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. వీరిద్దరిని ఆన్ స్క్రీన్ క్యూట్ కపుల్‌గా నిర్దారించేసారు ప్రేక్షకులు. అయితే ముందు వెంకటేశ్ పక్కన యాక్ట్ చేయాల్సిన మరో హీరోయిన్‌కు డేట్లు కుదరకపోవడంతో సౌందర్య సీన్‌లోకి వచ్చిందట.

ముప్పలనేని శివ దర్శకత్వం వహించిన రాజా ఒరిజినల్ తెలుగు సినిమా కాదు.. 'ఉన్నిడతిల్ ఎన్నై కొడుతేన్' అనే తమిళ మూవీకి రీమేక్. తమిళంలో లీడ్ రోల్స్‌లో కార్తిక్, రోజా, అజిత్ నటించారు. తమిళంలో ఈ సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుండి ప్రశంసలతో పాటు అవార్డులు కూడా చాలానే అందాయి. ఈ సినిమాకు ఉత్తమ నటిగా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకున్న రోజా తెలుగు రీమేక్‌లో కూడా నటించాలని నిర్ణయించుకుంది. దానికి తనకు అవకాశం లభించింది కూడా.

రాజా సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించుకున్న తర్వాత మూవీ టీమ్ రోజాను హీరోయిన్ రోల్ కోసం సంప్రదించింది. కానీ అప్పటికే తాను ఇతర సినిమాల్లో బిజీగా ఉంది. డేట్లు ఖాళీ లేక రాజాను తాను వదులుకోవాల్సి వచ్చింది. కాగా తమిళంలో కూడా రోజాకంటే ముందు మీనాను హీరోయిన్‌గా అనుకుంది మూవీ టీమ్. కానీ చివరి నిమిషంలో మీనా తప్పుకోవడంతో ఇలాంటి ఓ ల్యాండ్ మార్క్ సినిమాలో నటించే అవకాశాన్ని రోజా కొట్టేసింది.



Tags

Read MoreRead Less
Next Story