బాక్సింగ్ తో బాక్సాఫీస్ రింగ్ లో గెలిచేదెవరు..?

బాక్సింగ్ తో బాక్సాఫీస్ రింగ్ లో గెలిచేదెవరు..?
కొన్నాళ్ల క్రితం ఇండియాలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. వచ్చినా కంప్లీట్ గా కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయి.

కొన్నాళ్ల క్రితం ఇండియాలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. వచ్చినా కంప్లీట్ గా కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయి. మరికొన్ని వాస్తవాలకు చాలాదూరంలో కనిపిస్తాయి. కాకపోతే కొన్నాళ్లుగా ట్రెండ్ మారింది. ఆటల నేపథ్యంలో ఆకట్టుకుంటోన్న కథలు వస్తున్నాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఈ ట్రెండ్ విస్తరించింది. ఇందులో ప్రధానంగా మెప్పించింది గతంలో వచ్చిన చక్ దే ఇండియా. తర్వాత భాగ్ మిల్కా భాగ్, మేరీకోమ్, దంగల్ వంటి బాలీవుడ్ చిత్రాలు ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా తెలుగులో ఏఒన్ ఎక్స్ ప్రెస్ అంటూ సందీప్ కిషన్ హీరోగా హాకీ నేపథ్యంలో వచ్చిన సినిమా కూడా మెప్పించింది.

ఇక కరాటే, బాక్సింగ్ వంటి ఆటల నేపథ్యంలో సినిమాలు చాలా అంటే చాలా తక్కువగా వచ్చాయి. వచ్చిన వాటిలో యూత్ ను విపరీతంగా మెప్పించినవి పవన్ కళ్యాణ్ జానీ. అంతకు ముందే తమ్ముడు సినిమాలో బాక్సింగ్ నేపథ్యం ఉంది. కానీ ఇది పూర్తి స్థాయి సినిమా కాదు. అలాగే శ్రీహరి భద్రాచలంలో తైక్వాండో నేపథ్యంలో చేసిన విన్యాసాలూ ఆకట్టుకున్నాయి. అంతకు ముందు సై, గోల్కొండ హైస్కూల్ వంటి సినిమాలు వచ్చాయి. కానీ వాటిని పూర్తి స్థాయిలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు అని చెప్పలేం.

కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా గని అనే సినిమా వస్తోంది. ఇది పూర్తి స్థాయి బాక్సింగ్ నేపథ్యంలో సాగే సినిమా అంటున్నారు. అలాగే పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో వస్తోన్న లైగర్ కూడా ఇదే నేపథ్యంలో వస్తోన్న చిత్రం. లైగర్ ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం విజయ్ థాయ్ లాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు.

తెలుగువారితో పాటు బాలీవుడ్ లోనూ తుఫాన్ పేరుతో ఓ బాక్సింగ్ మూవీ వస్తోంది. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఫరాన్ అక్తర్ హీరోగా నటిస్తోన్న చిత్రం ఇది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఫర్హాన్ ఇంతకు ముందు భాగ్ మిల్కా భాగ్ తో తిరుగులేని పేరు తెచ్చుకున్నాడు. పైగా అతను ఓ సినిమా చేస్తున్నాడంటే దానికోసం ప్రాణం పెడతాడు. మొత్తంగా ఈ మూడు సినిమాలు వారాల వ్యవధిలోనే ఆడియన్స్ ముందుకు రాబోతోన్నాయి. మరి వీరిలో బాక్సింగ్ తో బాక్సాఫీస్ రింగ్ లో కింగ్ అనిపించుకునేదెవరో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story