సినిమా

SS Thaman: 'అఖండ'తో అదరగొట్టిన తమన్ రెమ్యునరేషన్ ఎంతంటే..?

SS Thaman: తరచుగా ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ సినిమాల ద్వారా ప్రేక్షకులకు పరిచయమవుతూ ఉంటారు.

SS Thaman (tv5news.in)
X

SS Thaman (tv5news.in)

SS Thaman: తరచుగా ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ సినిమాల ద్వారా ప్రేక్షకులకు పరిచయమవుతూ ఉంటారు. కానీ అందులో కొందరికి మాత్రమే చాలా గుర్తింపు దక్కుతోంది. సీనియర్స్ అయిపోయినా కూడా ఇంకా కొంతమంది సినీ పరిశ్రమలో రాణిస్తూ.. స్టార్స్‌తో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అందులో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తు్న్న పేరు ఎస్ ఎస్ తమన్.

ఇటీవల విడుదలయిన చాలామంది స్టార్ హీరోల సినిమాలకు సంగీతాన్ని అందించింది తమనే. తాజాగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను హ్యాట్రిక్ సినిమా 'అఖండ'కు కూడా తమనే మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ముఖ్యంగా ఈ సినిమాలో తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అని బాలయ్య అభిమానులు తనను పొగడ్తలతో ముంచేస్తున్నారు.

తమన్‌ను సోషల్ మీడియాలో నెటిజన్లు ఎంతగా ట్రోల్ చేస్తారో.. అంతే అభిమానిస్తారు కూడా. ఇతర సంగీత దర్శకులతో పోలిస్తే తమన్ పేరు ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటుంది. మరి ఈ సోషల్ మీడియా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌కు రెమ్యునరేషన్ ఎంత అన్న సందేహం ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. దానికి కొందరు సమాధానం కూడా చెప్పేస్తున్నారు.

తమన్ ఒక్కొక్క సినిమాకు దాదాపు రెండున్నర నుండి మూడున్నర కోట్ల రెమ్యునరేషన్‌ను తీసుకుంటాడని టాక్. కాకపోతే మ్యూజిక్ డైరెక్టర్‌కు వచ్చే రెమ్యునరేషన్‌లో వారు సౌండ్ ఇంజనీర్లకు, మ్యూజిక్ ప్లేయర్స్‌కు, మిక్స్ ఇంజనీర్లకు కూడా తమ వాటా ఇవ్వాల్సి ఉంటుంది. అలా మొత్తంగా కలిపితే తమన్ రెమ్యునరేషన్ ఇంత భారీగా ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి.

Next Story

RELATED STORIES