Siva Karthikeyan : శివ కార్తికేయన్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ సిక్స్ ప్యాక్ స్నాప్ ఫేక్ అంట..

Siva Karthikeyan : శివ కార్తికేయన్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ సిక్స్ ప్యాక్ స్నాప్ ఫేక్ అంట..
శివ కార్తికేయన్ సిక్స్ ప్యాక్ పై ఊహించని సమాధానమిచ్చిన మేకర్స్

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ ఇటీవలే 'మావీరన్‌'లో కనిపించాడు. ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయన దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం చెన్నైలో షూటింగ్‌లో బిజీగా ఉంది.

తమిళ ఇండస్ట్రీలో యాంకర్‌గా మొదలైన శివ కార్తికేయన్ ఇప్పుడు అందరికి గట్టి పోటీనిస్తూ స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. గతేడాది రిలీజైన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించాయి. అయితే తాజా అప్ డేట్ ప్రకారం శివ కార్తికేయన్ తన నెక్స్ట్ ఫిల్మ్ లో ఓ లుక్‌లో కనిపిస్తాడని వార్తలు వచ్చాయి. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ స్టార్ హీరో ఈ మూవీలో సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించనున్నాడని.. ఓ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ న్యూస్ పై తాజాగా మేకర్స్ స్పందించారు. వైరల్ అవుతోన్న శివ కార్తికేయన్ సిక్స్ ప్యాక్ ఫొటో ఫేక్ అని తేల్చి చెప్పేశారు.

ప్రస్తుతం శివ కార్తికేయన్ 'ఎస్‌కె 21'అనే తాత్కాలికంగా పేరు పెట్టిన సుదీర్ఘ షూటింగ్ షెడ్యూల్ కోసం కాశ్మీర్‌లో ఉన్నారు. గత కొన్ని నెలలుగా ఆయన తలపై టోపీతో కనిపిస్తున్నాడు. దీని ద్వారా శివ కార్తికేయన్ ఖచ్చితంగా తన శరీరాన్ని పెంచుకునే సూచనలను ఇచ్చాడు. అయితే ఈ క్రమంలోనే చొక్కా లేకుండా ఉన్న శివకార్తికేయన్ ఓ ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో ఆయన పర్ఫెక్ట్ సిక్స్ ప్యాక్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు. షాకింగ్ విషయం ఏమిటంటే, 'మావీరన్'లో కూడా కథ డిమాండ్ కారణంగా ఆయన తన పిరికి పాత్రకు తగ్గట్టు చాలా సన్నగా కనిపించాడు. ఇప్పుడిలా సిక్స్ ప్యాక్ లో కనిపించే సరికి 38 ఏళ్ల ఈ స్టార్ ఇంత తక్కువ సమయంలో ఎలా సిక్స్ ప్యాక్ చేశాడు అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.


అయితే ఈ స్నాప్ వైరల్ కావడంతో, అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. తమ అభిమాన నటున్ని ఈ సారి సిక్స్ ప్యాక్ లో చూడబోతున్నామంటూ ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఇంతలోనే.. మేకర్స్ వారికి అదిరిపోయే షాక్ ఇచ్చారు. ఆ స్నాప్ ఫేక్ అని ధృవీకరించారు. అభిమానులలో ఎవరైనా దీన్ని ఫొటోషాప్ చేసి ఉంటారని భావించారు. దీంతో శివ కార్తికేయన్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.

ఇదిలా ఉండగా.. సైన్యం నేపథ్యంలో దేశభక్తి గురించిన అంశం ఈ సినిమాలో ఉన్నందున 'SK 21' ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్ వీడియోను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. కమల్ హాసన్ నిర్మించిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మరో క్రేజీ పాయింటేంటే.. ఈ మూవీతో సాయి పల్లవి తన కెరీర్‌లోనే తొలిసారిగా శివకార్తికేయన్‌తో జతకట్టనుంది.



Tags

Read MoreRead Less
Next Story