సినిమా

Sudigali Sudheer: జబర్దస్త్ నుండి సుడిగాలి సుధీర్ టీమ్ క్విట్.. స్టేజ్‌పై ప్రకటన..

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్.. హోస్ట్‌గా, కమెడియన్‌గా చాలా సంవత్సరాల నుండి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

Sudigali Sudheer (tv5news.in)
X

Sudigali Sudheer (tv5news.in)

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్.. హోస్ట్‌గా, కమెడియన్‌గా చాలా సంవత్సరాల నుండి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న సెలబ్రిటీ. తనతో ఎప్పుడూ ఉండే శ్రీను, రామ్ ప్రసాద్. వీరు ముగ్గురు కలిసి చేసే కామెడీ స్కిట్స్‌కు చాలానే క్రేజ్ ఉంది. వీరి టీమ్‌కు అభిమానులు కూడా ఎక్కువే. జబర్దస్త్ షో పాపులర్ అయిన తర్వాత ఈ ముగ్గురికి వెండితెర అవకాశాలు కూడా రావడం మొదలయ్యాయి. అందుకే వీరి జబర్దస్త్ గురించి ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా ఇటీవల ప్రకటించారు.

జబర్దస్త్ నుండి సుధీర్ అండ్ టీమ్ తప్పుకుంటున్నట్టు చాలారోజులుగా వార్తలు వచ్చాయి. అయితే అందులో ఏదీ నిజం కాదంటూ గెటప్ శ్రీను వాటిని కొట్టిపారేశాడు. ఈ వార్త వారి అభిమానులకు కాస్త ఊరటను ఇచ్చింది. వార్త వచ్చి చాలాకాలం అయిపోయింది. వీరు ఎప్పటిలాగానే కామెడీ షోలో బిజీ అయిపోయారు. ఇంతలోనే ఈ వార్తల్లో నిజముందంటూ స్టేజ్‌పై అనౌన్స్ చేసింది సుధీర్ అండ్ టీమ్.

సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ జబర్దస్త్ నుండి తప్పుకుంటున్నట్టు వారు స్టేజ్‌పైనే అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా యూట్యూబ్‌లో విడుదల అయ్యింది. అయితే ఇది నిజం కాదని, ప్రాంక్ అని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ సినిమాల్లో నటిస్తూ ఉన్నా.. జబర్దస్త్‌ను మాత్రం విడిచి వెళ్లరని వారి అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

Next Story

RELATED STORIES