సినిమా

Sudigali Sudheer: సుధీర్ ప్లేస్‌లో బిగ్ బాస్ స్టార్.. 'ఢీ'కి కొత్త టీమ్ లీడర్..

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్.. అతనొక బుల్లితెర సూపర్ స్టార్. అతడి డ్యాన్స్‌లకు, కామెడీకి చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు.

Sudigali Sudheer: సుధీర్ ప్లేస్‌లో బిగ్ బాస్ స్టార్.. ఢీకి కొత్త టీమ్ లీడర్..
X

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్.. అతనొక బుల్లితెర సూపర్ స్టార్. అతడి డ్యాన్స్‌లకు, కామెడీకి చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్నో షోలలో తానొక స్పెషల్ అట్రాక్షన్. అయితే సుధీర్ ఇప్పుడు తనకు ఫేమ్ ఇచ్చిన ఒక్కొక్క షో నుండి మెల్లమెల్లగా తప్పుకుంటున్నాడు. ముందుగా అతడు జబర్దస్త్ నుండి తప్పుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. అంతే కాకుండా 'ఢీ' అప్‌కమింగ్ సీజన్‌లో కూడా సుధీర్ ఉండట్లేదని కన్ఫర్మ్ అయ్యింది.

సుధీర్, రష్మీ.. బుల్లితెర ఎంటర్‌టైన్మెంట్ షోలను ఫాలో అయ్యేవారికి ఈ పెయిర్ కచ్చితంగా ఐడియా ఉండుంటుంది. ఈ పెయిర్‌కు చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. వీరిద్దరు కలిసి 'ఢీ' డ్యా్న్స్ షోకు అయిదు సీజన్ల నుండి టీమ్ లీడర్స్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల ఢీ 13వ సీజన్ ముగిసింది. 14వ సీజన్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. కానీ ఈ 14వ సీజన్‌లో వీరిద్దరు ఉండట్లేదని తెలుస్తోంది.

ఇప్పటికే ఢీ 14లో సుధీర్‌కు బదులుగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 అఖిల్‌ను టీమ్ లీడర్‌గా ఎంపిక చేశారు. దీనిపై అఖిల్ కూడా స్పందించాడు. తాను కేవలం తీన్‌మార్ డ్యాన్సర్ అని, అలాంటి తనను ఆ షోకు సెలక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. మరి రష్మీ స్థానంలో ఎవరు టీమ్ లీడర్‌గా ఉండనున్నారన్న విషయం ఇంకా బయటికి రాలేదు.

Next Story

RELATED STORIES