సినిమా

Sukesh Chandrashekhar: రూ. 200 కోట్ల స్కా‌మ్‌లో బాలీవుడ్ భామల పేర్లు..

Sukesh Chandrashekhar: సుఖేశ్‌ చంద్రశేఖర్‌ కేసులో తవ్వే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Sukesh Chandrashekhar: రూ. 200 కోట్ల స్కా‌మ్‌లో బాలీవుడ్ భామల పేర్లు..
X

Sukesh Chandrashekhar: సుఖేశ్‌ చంద్రశేఖర్‌ కేసులో తవ్వే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 200కోట్ల మోసం కేసులో అరెస్టైన సుఖేశ్‌.. ప్రస్తుతం ఢిల్లీలోని తిహాడ్‌ జైలులో ఉన్నాడు. అయితే అక్కడ తనకు ఖరీదైన వసతులు కల్పించడంతో పాటు స్వేచ్ఛగా ఉండేందుకు వీలుగా జైలు సిబ్బందికి సుఖేశ్‌.. ప్రతి నెలా కోటి రూపాయలు లంచం ఇస్తున్నట్లు తాజాగా ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.

రాన్​ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్​, శివిందర్​ సింగ్​కు బెయిల్​ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా 200 కోట్లు వసూలు చేసిన కేసులో సుఖేశ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే జైలుకు వెళ్లినప్పటికీ అతడు తన తీరు మార్చుకోలేదు. పైగా జైలు నుంచే నేరాలు చేస్తున్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.

ఇందుకోసం జైలు సిబ్బందికి భారీగా లంచాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. జైల్లో మొబైల్‌ ఫోన్‌ వినియోగించేందుకు 15 రోజులకు దాదాపు 75 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక జైలు గదిలో లగ్జరీ సదుపాయాలతో పాటు స్వేచ్ఛగా ఉండేందుకు ప్రతి నెలా కోటి వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది. జైల్లో ఉన్న సుఖేశ్‌ను కలిసేందుకు జాక్వెలిన్‌ ఫెర్నాండెస్‌, నోరా ఫతేహీతో పాటు చాలా మంది బాలీవుడ్‌ హీరోయిన్లు, మోడల్స్‌ వచ్చేవారని తెలుస్తోంది.

మొత్తం 12 మంది హీరోయిన్లు, మోడల్స్ జైల్లో అతడిని కలిసినట్లు సమాచారం. అంతేగాక జైల్లో సిబ్బందికి సుఖేశ్‌.. చికెన్‌ పార్టీలు కూడా ఇచ్చేవాడంటున్నారు. ఇది ఇలా ఉంటే.. తిహాడ్‌ జైలు సిబ్బంది తనను వేధిస్తున్నారంటూ అధికారులకు లేఖ రాశాడు సుఖేశ్‌. తనను డబుల్‌ లాక్ గదిలో బంధించడంతో మానసికంగా కుంగిపోతున్నానని ఆ లేఖలో తెలిపాడు. అంతేగాక, తన భార్యను కేవలం రెండు వారాలకొకసారి మాత్రమే కలవనిస్తున్నారంటున్నాడు.

Next Story

RELATED STORIES