సినిమా

Sukumar : చంద్రబోస్‌కు డైరెక్టర్ సుకుమార్ పాదాభివందనం..!

Sukumar : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించగా, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

Sukumar : చంద్రబోస్‌కు డైరెక్టర్ సుకుమార్ పాదాభివందనం..!
X

Sukumar : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించగా, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. సినిమాకి ముందునుంచి మంచి టాక్ రావడంతో వసూళ్ళ పరంగా సినిమా దూసుకుపోతోంది. సినిమాకి సక్సెస్ టాక్ రావడంతో చిత్ర యూనిట్‌ థ్యాంక్యూ మీట్‌ను నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో పాటల రచయిత చంద్రబోస్‌ గురించి మాట్లాడుతూ పొగడ్తల ఎమోషనల్ అయ్యాడు డైరెక్టర్ సుకుమార్‌. అంతేకాకుండా చంద్రబోస్‌ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారు సుక్కు. అయితే వద్దని చంద్రబోస్‌ వారిస్తూ తాను కూడా సుకుమార్‌ పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. ఊ అంటావా అని చంద్రబోస్‌ గారు నాలుగేళ్ల క్రితం అన్నారని, అయితే మీరు ఉఉ అనండి.. దాన్ని అలానే దాచేయండి అని చెప్పానని నాకోసం నాలుగేళ్ల దాచిన ఆ పాట ప్రపంచం మొత్తాన్ని ఊ కొట్టిస్తుందని అన్నారు. ఆయన శక్తికి పాదాభివందనం... నాకు పాట కావాలంటే ఐదు నిమిషాల్లో ఈజీగా పాట, పల్లవి చెబుతుంటారు. అది చూసి నేను ఆశ్చర్యపోతుంటానని చెప్పుకొచ్చారు సుకుమార్. చంద్రబోస్ మాములు వ్యక్తిగానే కనిపిస్తారని కానీ పాట రాసినప్పుడు మాత్రం ఆయన శక్తి ఏంటో తెలుస్తుందని సుకుమార్ తెలిపారు.Next Story

RELATED STORIES