సినిమా

ప్రమాదంలో విజయ్ దేవరకొండ - సుకుమార్ సినిమా..?

సినిమా వారి ప్లానింగ్స్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఏకంగా రెండు మూడేళ్లకు సరిపడా ప్లానింగ్స్ తో పక్కాగా ముందుకు వెళతారు.

ప్రమాదంలో విజయ్ దేవరకొండ - సుకుమార్ సినిమా..?
X

సినిమా వారి ప్లానింగ్స్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఏకంగా రెండు మూడేళ్లకు సరిపడా ప్లానింగ్స్ తో పక్కాగా ముందుకు వెళతారు. కానీ ఈ సారి కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అందరి ప్లాన్లూ బెడిసికొట్టాయి. ముందు వెనకా అని లేకుండా ఎవరు ఎప్పుడు వస్తారో.. ఏ కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి వచ్చింది. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకూ అదే పరిస్థితి. అందుకే చాలా వేగంగా షూటింగ్ పూర్తి చేస్తాడని పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ సైతం విజయ్ దేవరకొండ 'లైగర్' విషయంలో కామ్ గా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఆ మధ్య వరుసగా ఫ్లాపులు వచ్చి ఇబ్బంది పడ్డాడు విజయ్ దేవరకొండ. అయినా అతని క్రేజ్ తగ్గలేదు. అందుకు నిదర్శనమే ఈ 'లైగర్'. మొదట తెలుగు సినిమాగా మొదలైనా.. బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఎంట్రీతో ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా మారింది. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీకి పూరీ, ఛార్మీ కూడా నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. చాలా ఉత్సాహంగా మొదలైన ఈ సినిమాకు కరోనా బ్రేకులు వేసింది. ఇదే ఇప్పుడు విజయ్ తర్వాతి సినిమాలపై ప్రభావం చూపించబోతోంది.

పూరీ జగన్నాథ్ తర్వాత విజయ్.. సుకుమార్ తో సినిమా చేయాలనుకున్నాడు. కానీ అటు సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న 'పుష్ప' కూడా లేటవుతోంది. పైగా వీరి కాంబోకు కథ పూర్తి స్థాయిలో లేదని కూడా అంటున్నారు. మరోవైపు విజయ్.. శివ నిర్వాణ డైరెక్షన్ లో మైత్రీ మూవీస్ పతాకంపై సినిమా చేయాల్సి ఉంది. శివ వద్ద బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉందట. సో.. సుకుమార్ తో సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆ గ్యాప్ లో అల్లు అర్జున్ 'ఐకన్' పూర్తి చేసి 'పుష్ప-2' కు రెడీ అవుతాడు. అప్పుడు విజయ్-శివ నిర్వాణ కాంబోలో సినిమా చేస్తున్నప్పుడు సుకుమార్ రెండు సినిమాలకు కథ రెడీ చేయాలి. వరస చూస్తోంటే.. విజయ్ దేవరకొండ - సుకుమార్ సినిమా ఇప్పట్లో ఉండేలా లేదేమో అనిపిస్తోంది. అంతేగా మరి.

YJ Rambabu

TV5 Entertainment EditorNext Story

RELATED STORIES