సినిమా

Suma Kanakala: లవ్ స్టోరీలో రాజీవ్ కనకాల క్యారెక్టర్‌పై సుమ హాట్ కామెంట్..

Suma Kanakala: హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాదు కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా ఎంతోమంది అభిమానులు ఉంటారు.

Suma Kanakala: లవ్ స్టోరీలో రాజీవ్ కనకాల క్యారెక్టర్‌పై సుమ హాట్ కామెంట్..
X

Suma Kanakala: హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాదు కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా ఎంతోమంది అభిమానులు ఉంటారు. వారితో పాటు పాత్రలో లీనమయ్యేలా చేసే ఏ నటీనటులను అయినా ప్రేక్షకులు అమితంగానే ఇష్టపడతారు. అలాంటి వారిలో ఒకడే రాజీవ్ కనకాల(Rajeev Kanakala). తాను ఏ పాత్ర చేసినా దానికి పూర్తిగా న్యాయం చేస్తూ.. తనతో పాటు ప్రేక్షకులను నవ్వించడమే కాదు ఏడిపించగలడు కూడా. గత కొంతకాలంగా సరైన హిట్ లేక, క్యారెక్టర్ రాక వెనకబడిన కనకాలకు లవ్ స్టోరీ సూపర్ డూపర్ హిట్‌ను అందించింది. అయితే ఈ సినిమాలో ఆయన చేసిన పాత్రపై తన భార్య సుమ స్పందించారు.

తమ నటనతో పాత్రలోకి తీసుకెళ్లగలిగే నటులు కొందరే ఉంటారు. అందులో నా భర్త రాజీవ్ కనకాల కూడా ఒకరు. లవ్ స్టోరీలో ఇలాంటి పాత్ర చేయడానికి నువ్వెంత ఫీల్ అయ్యావో నాకు తెలుసు. కానీ ఈ క్యారెక్టర్ ద్వారా చాలామంది జీవితాలపై నువ్వు ప్రభావం చూపించావు అంటూ తన భర్తను పొగడ్తలతో ముంచేసారు సుమ. అంతే కాకుండా ఇంత మంచి సినిమాను తెరకెక్కించినందుకు శేఖర్ కమ్ముల, నాగచైతన్య, సాయి పల్లవికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇందులో సాయి పల్లవి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు.

Next Story

RELATED STORIES