Sunny Thanks Mumbai Police : ముంబై పోలీసులకు సన్నీ లియోన్ థ్యాంక్స్

Sunny Thanks Mumbai Police : ముంబై పోలీసులకు సన్నీ లియోన్ థ్యాంక్స్
ముంబై పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేసిన బాలీవుడ్ నటి, మోడల్ సన్నీ లియోన్

బాలీవుడ్ నటి, మోడల్ సన్నీ లియోన్ ముంబై పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేసింది. ఆమె ఇంటి పనిమనిషి కుమార్తె తప్పిపోయిన 24 గంటల తర్వాత ఇది జరిగింది. నవంబర్ 9న, ముంబైలోని జోగేశ్వరిలో తన హౌస్ హెల్ప్ తొమ్మిదేళ్ల కుమార్తె అనుష్క కిరణ్ మోర్ అదృశ్యమైందని సన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ పోస్ట్‌లో, ఆమె తప్పిపోయిన అమ్మాయి గురించిన ఫొటో, సమాచారాన్ని అందించింది. ఆ అమ్మాయిని తన కుటుంబంతో తిరిగి చేర్చిన వారికి రూ. 50,000 బహుమతిని అందజేస్తామని ప్రకటించింది.

తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో, సన్నీలియోన్ ముంబై పోలీసులకు, మద్దతుదారులకు ధన్యవాదాలు తెలుపుతూ అనుష్క దొరికిందని ప్రకటించింది. "మా ప్రార్థనలు ఫలించాయి. గాడ్ ఈజ్ సో గ్రేట్. దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. కుటుంబం నుండి... ముంబై పోలీసులకు చాలా ధన్యవాదాలు. అనుష్క అదృశ్యమైన 24 గంటల తర్వాత మేము ఆమెను గుర్తించాము. నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. ఈ పోస్ట్‌ను షేర్ చేసినందుకు, వార్తలను వైరల్ చేసినందుకు థ్యాంక్యూ. నేను ప్రతి ఒక్కరికీ హార్ట్ ఫుల్ గా కృతజ్ఞతలు తెలుపుతున్నాను”అని ఆమె పోస్ట్‌లో రాసింది.

ఈ పోస్ట్‌లో అనుష్కను ఆమె తల్లిదండ్రులు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నట్లు చూపించే ఫొటో కూడా ఉంది. బాలిక ఆచూకీ కోసం సన్నీలియోన్ అభిమానులు, ఫాలోవర్లు ఆమెను, ముంబై పోలీసుల ఉమ్మడి ప్రయత్నాలను అభినందించారు. ఈ పోస్ట్‌పై వ్యాఖ్యలు సన్నీ లియోన్, ముంబై పోలీసులను ప్రశంసలతో నింపాయి. యూజర్స్ కూడా రిలీఫ్ గా ఉందంటూ కామెంట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story