Mahesh Babu : మహేష్ తోనే ఆచార్య మొదలు..!

Mahesh Babu :  మహేష్ తోనే ఆచార్య మొదలు..!
Mahesh Babu : కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన లెటేస్ట్ మూవీ ఆచార్య... రామ్ చరణ్ కీలకపాత్ర పోషించాడు.

Mahesh Babu : కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన లెటేస్ట్ మూవీ ఆచార్య... రామ్ చరణ్ కీలకపాత్ర పోషించాడు.కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

అయితే ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో ఈ సినిమా మొదలుకానుందని తెలుస్తోంది. చిరంజీవి ఈ సినిమా కోసం మహేష్ ని అప్రోచ్ కాగా సూపర్ స్టార్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.. అయితే ఈ విషయాన్ని మేకర్స్ ఇంకా రివిల్ చేయలేదు.

ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకి ముందుగా మహేష్ బాబునే అనుకున్నారు కొరటాల.. కానీ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్ల మహేష్ ఆ రోల్ ని చేయలేకపోయారు. కాగా గతంలో చిరంజీవి తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story