Krishna-Sridevi: సూపర్ హిట్ జోడి.. కృష్ణకు తల్లిగా, కూతురిగా!!

Krishna-Sridevi: సూపర్ హిట్ జోడి.. కృష్ణకు తల్లిగా, కూతురిగా!!
బాలనటిగా వెండితెరకు వెలుగులు పంచిన అందాల తార శ్రీదేవిని ఓ ధృవ నక్షత్రంగా చెప్పుకుంటారు సీనియర్ నటులు.

Krishna-Sridevi: బాలనటిగా వెండితెరకు వెలుగులు పంచిన అందాల తార శ్రీదేవిని ఓ ధృవ నక్షత్రంగా చెప్పుకుంటారు సీనియర్ నటులు. అందంగా, ముద్దుగా ఉన్న ఆమెను కాబోయే స్టార్ హీరోయిన్ ‌అని శోభన్ బాబుతో సహా పలువురు సినీ ప్రముఖులు అంటూ ఉండేవారు. అన్నట్లుగానే ఆమె అప్పటి హీరోలకు కూతురిగా, మనవరాలిగా నటించి.. టీనేజ్‌లోకి వచ్చాక అదే హీరోలతో కలిసి స్టెప్పులేసింది. ఆ తరం హీరోలందరితోనూ నటించింది.

కానీ ఎక్కువగా సూపర్ స్టార్ కృష్ణతో నటించింది. వీళ్లద్దరిదీ హిట్ పెయిర్ అని ఇండస్ట్రీలో టాక్ ఉండేది. కృష్ణ శ్రీదేవి కలిసి నటించిన చిత్రాలన్నీ దాదాపు బ్లాక్ బస్టర్‌లు. బాలీవుడ్‌లో నంబర్ వన్ నటి కావడానికి ముందు, శ్రీదేవి దక్షిణ భారతదేశంలో చాలా బిజీ నటి. తమిళ్ మరియు తెలుగులోని ప్రముఖ నటీనటులందరితోనూ ఆమె ఎన్నో హిట్‌లు కొట్టింది. కాగా శ్రీదేవి చిన్నప్పుడు కృష్ణ సినిమాలో అతడి కూతురిగా నటించింది. ఆ చిత్రం

1970 లో నందన్ రావు దర్శకత్వంలో వచ్చిన ''మా నాన్న నిర్దోషి". ఈ సినిమాలో కృష్ణ విజయ నిర్మల హీరో, హీరోయిన్లుగా నటించారు. శ్రీదేవి ఇందులో బాలనటిగా కనిపించారు. 1970 మార్చిలో తాపీ చాణక్య దర్శకత్వం లో "విధి విలాసం" అనే చిత్రం విడుదలైంది. ఇందులో కూడా కృష్ణ, విజయ నిర్మల హీరో హీరోయిన్లు. వీరిద్దరికీ కూతురిగా శ్రీదేవి నటించింది.

" దేవుడు లాంతి మనిషి " చిత్రంలో ఆమె అతని సోదరి పాత్రను పోషించింది. మరో చిత్రం " సమాజానికి సవాల్" లో శ్రీదేవి కృష్ణ తల్లిగా నటించింది.

అలా శ్రీదేవి.. కృష్ణ సినిమాలలో బాలనటిగా కనిపించి ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో ఆయన ప్రక్కన హీరోయిన్ గా నటించారు. అందం, అభినయం శ్రీదేవికి దేవుడిచ్చిన గొప్ప వరం. అందరి హీరోలతో ఆడిపాడిన శ్రీదేవి తెలుగు సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. అతిలోక సుందరి అనగానే శ్రీదేవి మాత్రమే గుర్తొస్తుంది ఇప్పటికీ. తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసిన శ్రీదేవి భువిని విడిచి దివికేగి ఏళ్లు గడిచినా ఆమెని ఎప్పటికీ మరిచిపోలేరు సినీ అభిమానులు.

Tags

Read MoreRead Less
Next Story