Suresh Babu - Venkatesh : దగ్గుబాటి బ్రదర్స్‌‌ని స్టార్ లను చేసిన ఒకే సినిమా..!

Suresh Babu - Venkatesh :  దగ్గుబాటి బ్రదర్స్‌‌ని స్టార్ లను చేసిన ఒకే సినిమా..!
Suresh Babu - Venkatesh : తెలుగు ఇండస్ట్రీలో మూవీ మొఘల్ గా నిర్మాత డి రామానాయుడుకి పేరుంది. శతాధిక చిత్రాలను నిర్మించి, ప్రపంచ రికార్డ్ సృష్టించిన ఆయన గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు.

Suresh Babu - Venkatesh : తెలుగు ఇండస్ట్రీలో మూవీ మొఘల్‌‌‌గా నిర్మాత డి రామానాయుడుకి మంచి పేరుంది. శతాధిక చిత్రాలను నిర్మించి, ప్రపంచ రికార్డ్ సృష్టించిన ఆయన గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్‌‌‌లో చోటు సంపాదించారు.. ఆయన వారుసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు సురేష్ బాబు, వెంకటేష్.. ఇందులో సురేష్ బాబు ప్రొడ్యూసర్ అవ్వగా, వెంకటేష్ హీరో అయ్యాడు. ఇద్దరు ఇప్పుడు టాప్‌‌‌లో ఉండడం విశేషం. అయితే వీరిద్దరిని టాప్‌‌‌లో నిలిపింది ఒకే చిత్రం కావడం విశేషం.

సురేష్ బాబుకి చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం.. తండ్రి రామానాయుడుతో కలిసి కథాచర్చల్లో పాల్గొనేవారు. నిర్మాతగా ఎలా రాణించాలో తండ్రి వద్ద మెలుకువలు నేర్చుకున్నారు. ఇక అటు కలియుగ పాండవులు చిత్రంతో వెంకటేష్ హీరోగా టాలీవుడ్‌‌‌కి ఎంట్రీ ఇచ్చాడు. నటుడుగా ఒకే అనిపించుకున్నాడు కానీ మాస్ హీరో అన్న ఇమేజ్ అప్పటికి ఇంకా రాలేదు. సరిగ్గా ఇలాంటి టైంలో సురేష్ ప్రొడక్షన్ బాధ్యతలు మొత్తం తానే తీసుకొని నిర్మాతగా మొదటి సినిమా చేసేందుకు సిద్దమయ్యారు సురేష్ బాబు.

అందులో భాగంగానే మొదటి సినిమాకి మంచి మాస్ కథని ఎంచుకున్నారు సురేష్ బాబు . అదే బొబ్బిలి రాజా.. పరిచూరి బ్రదర్స్ కథని అందించారు. దర్శకుడిగా బి. గోపాల్ ని తీసుకున్నారు. జయంత్ సి పరాన్జీ ఈ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఈ సినిమాలో వాణిశ్రీ పోషించిన రాజేశ్వరిదేవి పాత్రకు మొదటగా నటి శారదను అనుకున్నారు. కానీ అప్పటికే శారద అలాంటి పాత్రలు చాలా చేసి ఉండటంతో సురేశ్ బాబు సూచన మేరకు కొత్తదనం కోసం వాణిశ్రీని తీసుకున్నారు. ఇక హీరోయిన్ పాత్రకు కూడా మొదటగా రాధను అనుకున్నారు. కానీ గోపాలకృష్ణ కొత్త అమ్మాయిని తీసుకుందామని ప్రతిపాదించడంతో దివ్యభారతిని తీసుకున్నారు. ఈ సినిమాతో దివ్యభారతి టాలీవుడ్‌‌‌కి ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాతో వెంకటేష్ స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రేక్షకుల్లో మాస్ హీరో అనే ఇమేజ్ ఈ చిత్రంతోనే వెంకటేష్‌‌‌కి ఏర్పడింది. అటు సురేష్ బాబుకి ఇది నిర్మాతగా మొదటి సినిమా.. మొదటి సినిమాతో నిర్మాతగా సూపర్ సక్సెస్ కొట్టి తండ్రికి తగ్గ తనయుడని అనిపించుకున్నాడు. సో అన్నదమ్ములిద్దరూ ఒకే సినిమాతో స్టార్ ఇమేజ్‌‌ని సొంతం చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story