సినిమా

ఎస్పీ మ్యూజిక్.. సంగీత ప్రపంచంలోకి సురేష్ ప్రొడక్షన్స్..

ఎస్పీ మ్యూజిక్ పేరుతో సురేష్ ప్రొడక్షన్స్ గురువారం సంగీత రంగంలోకి ప్రవేశించింది.

ఎస్పీ మ్యూజిక్.. సంగీత ప్రపంచంలోకి సురేష్ ప్రొడక్షన్స్..
X

ఎస్పీ మ్యూజిక్ పేరుతో సురేష్ ప్రొడక్షన్స్ గురువారం సంగీత రంగంలోకి ప్రవేశించింది. 1964 లో దివంగత దగ్గుబాటి రామానాయుడు స్థాపించిన ప్రఖ్యాత ప్రొడక్షన్ హౌస్ నుంచి మ్యూజిక్ లేబుల్‌ను ట్విట్టర్‌లో విడుదల చేశారు.

"50 సంవత్సరాలకు పైగా సినిమా ఇండస్ట్రీకి సేవలందిస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ ఇప్పుడు ఎప్పీ మ్యూజిక్ పేరుతో సంగీత ప్రపంచంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. సంగీతానికి ఎల్లప్పుడూ మన చిత్రాల్లో పెద్ద పీట ఉంటుంది. దానిని గుర్తించే సొంతంగా ఓ మ్యాజిక్ ఫ్లాట్‌ఫాంని తీసుకొస్తున్నాం. సురేష్ ప్రొడక్షన్స్ యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్న ఎస్పి మ్యూజిక్ స్వచ్ఛమైన సంగీతాన్ని అందించే వేదికగా మారడం ఆనందంగా ఉందని సురేష్ ప్రొడక్షన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

Next Story

RELATED STORIES