సినిమా

Sushmita Sen: వయసులో చిన్న అయిన మోడల్‌తో డేటింగ్.. మనస్పర్థలతో బ్రేకప్ చెప్పిన మాజీ విశ్వసుందరి..

Sushmita Sen: మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ అంటే ఇప్పటికీ ఓ బ్రాండ్‌లాగా నిలిచిపోయింది.

Sushmita Sen (tv5news.in)
X

Sushmita Sen (tv5news.in)

Sushmita Sen: మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ అంటే ఇప్పటికీ ఓ బ్రాండ్‌లాగా నిలిచిపోయింది. ముందు మిస్ ఇండియాగా, ఆ తర్వాత మిస్ యూనివర్స్‌గా కిరీటం గెలుచుకుని ఎంతోమంది కుర్రకారు మనసు దోచుకుంది సుస్మితా. అప్పుడే కాదు ఇప్పటికీ తనలాగా ఉండాలని గ్లామర్ ప్రపంచంలో ఉన్న ఎంతోమంది అమ్మాయిలు కోరుకుంటారు. ప్రొఫెషనల్‌గానే కాదు పర్సనల్‌గా కూడా సుస్మితాసేన్ లైఫ్ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది.

సుస్మితాసేన్ 2000లో ఒకరిని, 2010లో ఒకరిని దత్తతు తీసుకుంది. ప్రస్తుతం ఆ ఇద్దరు కూతుళ్లతోనే జీవితాన్ని గడిపేస్తున్న సుస్మితాసేన్ కొంతకాలం క్రితం తనకంటే వయసులో చిన్నవాడైన రోహ్మాన్‌ షాల్‌ అనే మోడల్‌తో డేటింగ్ మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో వీరి ఫోటోలు వైరల్ అవ్వడం మొదలయ్యింది. కానీ ఉన్నట్టుండి ఏమైందో ఈ జంట విడిపోనుందని ప్రకటించింది.


2018లో సోషల్ మీడియా ద్వారా పరిచయమయిన సుస్మితాసేన్, రోహ్మాన్‌ షాల్‌ దాదాపు మూడు సంవత్సరాలు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే గత కొంతకాలంగా వారి రిలేషన్‌లో మనస్పర్థలు వచ్చాయని, విడిపోనున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తు్న్నాయి. అయితే అదే నిజమని సుస్మితాసేన్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్‌తో క్లారిటీ వచ్చింది.


Next Story

RELATED STORIES