సినిమా

Swara Bhasker: ఆ హీరోయిన్ చనిపోవాలని కోరుకుంటున్న కొందరు నెటిజన్లు.. నటి ఘాటు రిప్లై..

Swara Bhasker: సోషల్ మీడియా నుండి ప్రేక్షకుల నుండి విపరీతంగా నెగిటివిటీని ఎదుర్కుంటున్న ఓ హీరోయిన్ స్వర భాస్కర్.

Swara Bhasker (tv5news.in)
X

Swara Bhasker (tv5news.in)

Swara Bhasker: గ్లామర్ ప్రపంచంలో ఒకరికి ఎంతమంది అభిమానులు అవుతారో.. అంతకంటే ఎక్కువమంది శత్రువులు అవుతారు కూడా. ముఖ్యంగా హీరోయిన్లు ఎవరైనా కాస్త స్వేచ్ఛగా మాట్లాడాలి అనుకుంటే వారికి వెంటనే నెగిటివిటీ పెరిగిపోతుంది. బాలీవుడ్‌లో ఇలాంటివి ఎక్కువ. అలా సోషల్ మీడియా నుండి ప్రేక్షకుల నుండి విపరీతంగా నెగిటివిటీని ఎదుర్కుంటున్న ఓ హీరోయిన్ స్వర భాస్కర్.

స్వర భాస్కర్.. బాలీవుడ్‌లో అడుగుపెట్టి చాలాకాలమే అయినా.. తన డ్యాషింగ్ నేచర్‌తో ఇంకా పెద్దగా గుర్తింపును సాధించుకోలేకపోయింది. తనకు ఏదైనా నచ్చకపోతే ఓపెన్‌గా చెప్పేయడం తన మనస్తత్వం. అలా తన చుట్టూ చాలా కాంట్రవర్సీలు తిరుగుతూ ఉంటాయి. ఇటీవల చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడిన తరుణంలో స్వర కూడా తనకు కరోనా సోకిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

స్వర సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్‌లకు పాజిటివిటీ కంటే నెగిటివిటీనే ఎక్కువ. అలాగే తాను కోవిడ్ బారిన పడిందంటూ పెట్టిన పోస్ట్‌కు కూడా అలాగే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. చాలామంది తాను చనిపోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెట్టారు. దానికి స్వర ఘాటుగా రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

'మిత్రులారా.. మీ భావాలను మీ ఆలోచనల్లోనే ఉంచుకోండి. నాకు నిజంగానే ఏమైనా అయితే.. మీరు తినే తిండి చేజారిపోతుంది. అప్పుడు మీ ఇల్లు ఎలా గడుస్తుంది' అంటూ నెగిటివ్ కామెంట్స్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేసింది స్వర. తనను తిట్టుకుంటూనే కొంతమంది పొట్ట నింపుకుంటున్నారని, తాను ఒకవేళ నిజంగానే చనిపోతే.. వారికి తిండి ఎలా దొరుకుందన్న ఉద్దేశ్యంతో స్వర ఈ పోస్ట్ పెట్టింది.


Next Story

RELATED STORIES