సినిమా

Tabu: బాలీవుడ్ యంగ్ హీరోకు టబు స్వీట్ వార్నింగ్..

Tabu: ప్రస్తుతం బాలీవుడ్‌లో రీమేక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు తెలుగు నుండి హిందీకి రీమేక్ అయ్యాయి.

Tabu: బాలీవుడ్ యంగ్ హీరోకు టబు స్వీట్ వార్నింగ్..
X

Tabu: ప్రస్తుతం బాలీవుడ్‌లో రీమేక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు తెలుగు నుండి హిందీకి రీమేక్ అయ్యాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సూపర్ హిట్ అయిన 'అల వైకుంఠపురం' రీమేక్ షూటింగ్ కూడా బాలీవుడ్‌లో చోటుచేసుకుంటుంది. దీనికి 'షెహ్‌జాదా' అన్న టైటిల్‌ను కూడా ఖరారు చేసింది మూవీ టీమ్. అయితే ఈ సినిమాకు సంబంధించి రెండురోజుల క్రితం జిరిగిన ఓ సంఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది.

కార్తిక్ ఆర్యన్, కృతి శెట్టి జంటగా తెరకెక్కుతున్న 'షెహ్‌జాదా'ను రోహిత్ ధావన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. అయితే తెలుగు సూపర్ హిట్ అయిన ఈ సినిమాను ఎలాగైనా హిందీలో కూడా బ్లా్క్ బస్టర్ చేయాలని మూవీ టీమ్ ఆశిస్తోంది. అందుకే ఎక్కువగా మార్పులు చేయకుండా అదే కథతో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

తెలుగులో అల వైకుంఠపురంలో సినిమాలో కీలక పాత్ర పోషించింది టబు. ఇందులో అల్లు అర్జున్ పాత్రలో నటించిన టబు.. ఎప్పటిలాగానే తన యాక్టింగ్‌తో అందరినీ మెప్పించింది. అంతే కాదు.. చాలాకాలం తర్వాత అల వైకుంఠపురంతోనే తెలుగులోకి కమ్ బ్యాక్ ఇచ్చింది కూడా. అందుకే 'నా సినిమాను జాగ్రత్తగా రీమేక్ చేయండి' అంటూ కార్తీక్ ఆర్యన్ ఇన్‌స్టాగ్రామ్‌లోని పోస్ట్‌కు స్వీట్ వార్నింగ్ ఇస్తూ కామెంట్ పెట్టింది.Next Story

RELATED STORIES