బోల్డ్ కంటెంట్ లో నటించిన తమన్నా.. నెటిజన్లు షాక్

బోల్డ్ కంటెంట్ లో నటించిన తమన్నా..  నెటిజన్లు షాక్
తమన్నా ఇప్పుడెందుకు సన్నీలియోనీలా మారిపోయారని ఫైర్ అవుతున్నారు

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా రాణించిన హీరోయిన్ తమన్నా భాటియా. కెరీర్ మొదటినుంచి బోల్డ్ కంటెంట్ జోలికి పోకుండా సినిమాలు చేసుకుంటు వచ్చింది. తాజాగా ఆవిడ నటించిన 'జీ కర్ దా' అనే వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించింది. దీంతో నెటిజన్లు, ఆవిడ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటి వరకు సహజంగా నటించిన తమన్నా ఇప్పుడెందుకు సన్నీలియోనీలా మారిపోయారని ఫైర్ అవుతున్నారు. ఇందుకు కారణం 'జీ కర్ దా' లో బోల్డ్, సెక్సీ సన్నివేశాల్లో విజృంభించడమేనని అంటున్నారు. ఆవిడ కెరీర్ లోనే అత్యంత చెత్త కంటెంట్ ఎంచుకుందని తెలిపారు.

ఇందుకుగాను.. బోల్డ్ కంటెంట్ పై తమన్నాను మీడియా ప్రశ్నించింది. అందుకు వివరణ ఇచ్చిన ఆవిడ... తామేమీ ప్రేక్షకులను రాబట్టుకోవాలని అలా చేయలేదని చెప్పింది. కథ డిమాండ్ చేయడంతోనే తాను బోల్డ్ గా నటించానని తెలిపింది. ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్ డ్రామాను చూపించినప్పుడు ఆ మాత్రం చేయక తప్పదని చెప్పింది. ప్రజలు ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఇది వాస్తవమని తెలిపింది. తనతో నటించిన కోస్టార్ సుహేల్ చాలా సహజంగా నటించాడని, అతని నుంచి కానీ, తన నుంచి కానీ ఎటువంటి ఫిర్యాదులు లేవని చెప్పింది.


'జీ కర్ దా' సిరీస్ జూన్ 2న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. ఇందులో ఆవిడ నటించిన బోల్డ్ కంటెంట్ కు విమర్శలపాలైంది. అయితే ఆవిడ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. విజయ్ - తమన్నాలు లస్ట్ స్టోరీస్ - 2 లో కనిపించనున్నారు. వారి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నట్లు చిత్ర యునిట్ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story