హాస్యనటుడు వివేక్ కన్నుమూత..

హాస్యనటుడు వివేక్ కన్నుమూత..
ఆ రోజునే, అతడికి యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్లు వేశారు. అయినా ఆయన ఆరోగ్యం క్షీణించి ఈ రోజు ఉదయం వివేక్ కన్నుమూశారు.

శివాజీ, ఖుషి, వంటి చిత్రాలలో నటించిన తమిళ హాస్య నటుడు వివేక్ గుండెపోటుతో మరణించారు. హాస్యనటుడిగా కెరీర్ ప్రారంభించి అతి కొద్ది కాలంలోనే ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మిన్నాలే , అలైపయుతేయ్ , ముగావరి, దమ్ దమ్ దమ్, అనియన్ చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి.

59 సంవత్సరాల వయసున్న వివేక్ గుండెపోటుతో ఈ ఉదయం కన్నుమూశారు. 500 కి పైగా చిత్రాల్లో నటించిన కమెడియన్ గుండెలో అసౌకర్యంగా ఉందని అనడంతో కుటుంబసభ్యులు వెంటనే అతడిని శుక్రవారం చెన్నైలోని సిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు.

ఆ రోజునే, అతడికి యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్లు వేశారు. అయినా ఆయన ఆరోగ్యం క్షీణించి ఈ రోజు ఉదయం వివేక్ కన్నుమూశారు. నివిన్ పౌలీ , ప్రకాష్ రాజ్ , దేవి శ్రీ ప్రసాద్ తదితరులు సహా దక్షిణాదికి చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో వివేక్ మృతికి చింతిస్తూ తమ ప్రగాఢసానుభూతిని వ్యక్తం చేశారు.

వివేక్ చివరిసారిగా కనిపించినది హర్సిహ్ కల్యాణ్. ఇది ఆయుష్మాన్ ఖుర్రానా నటించిన విక్కీ డోనర్ యొక్క తమిళ రీమేక్. దీనికి కృష్ణ మారిముత్తు దర్శకత్వం వహించారు.ఒకానొక సమయంలో ఆయన లేకుండా తమిళ సినిమాలు రిలీజ్ అయ్యేవి కావని సినీ ప్రముఖులు గుర్తు చేసుకున్నారు.

తెలుగు, తమిళ ప్రేక్షకులకు దగ్గరైన వివేక్ నటనకుగాను 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది. వివేక్ కొడుకు ప్రసన్న కుమార్ 13 ఏళ్ల వయసులో మెదడులో రక్తం గడ్డకట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. అనారోగ్యంతో తల్లి మరణం ఈ రెండూ వివేక్‌ను కలచి వేస్తుండేవి.

అప్పటి నుంచి సినిమాలు చేయడం కూడా తగ్గించాడని సన్నిహితులు తెలిపారు. గురువారం కరోనా వ్యాక్పిన్ వేయించుకున్న వివేక్.. ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

వివేక్ మరణంతో దిగ్భ్రాంతికి గురైన తమిళ పరిశ్రమలోని ప్రముఖులు సుహాసిని, రాఘవ లారెన్స్, జీవా, సమంత, ధనుష్, విజయ్ సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story