సినిమా

KV Anand : ప్రముఖ దర్శకుడు కె.వి ఆనంద్ కన్నుమూత..!

కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ దర్శకుడు కెవి ఆనంద్(54) మృతి చెందారు.

KV Anand : ప్రముఖ దర్శకుడు కె.వి ఆనంద్ కన్నుమూత..!
X

కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ దర్శకుడు కెవి ఆనంద్(54) మృతి చెందారు. గుండెపోటుతో ఈ రోజు ఉదయం చెన్నైలోని తన నివాసంలో మృతి చెందారు. ఆయన మృతి పట్ల చిత్ర పరిశ్రమలోని పలువురు సంతాపం తెలుపుతున్నారు. దర్శకుడిగా కంటే ముందు జర్నలిస్ట్, సినిమాటోగ్రాఫర్ గా ఆయన సేవలను అందించారు. తెన్మివాన్ కోంబత్ చిత్రానికి గాను 1994లో జాతీయ పురస్కారం అందుకున్నారు. ఇక 2005లో ఆయన దర్శకుడిగా మారారు. అయాన్, కో, కావన్, కప్పాన్, లాంటి ఎన్నో చిత్రాలకి దర్శకత్వం వహించారు. తెలుగులో డబ్ అయిన రంగం, వీడోక్కడే, బ్రదర్స్ సినిమాలు ఈయన తీసినవే.!

Next Story

RELATED STORIES