సినిమా

సమంత స్పెషల్‌ సాంగ్‌పై మరో వివాదం.. కేసు పెడతామని హెచ్చరిక.... !

ఇప్పటికే ఈ సాంగ్ పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ పురుషుల సంఘం కోర్టు ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మగవాళ్ళు కేవలం కామంతోనే ఉంటారన్న మీనింగ్ వచ్చేలా ఆ పాట ఉందని...

సమంత స్పెషల్‌ సాంగ్‌పై మరో వివాదం.. కేసు పెడతామని హెచ్చరిక.... !
X

Pushpa Item Song : టాలీవుడ్ లో పుష్ప హావా ఇప్పుడు మాములుగా లేదు.. ఎక్కడ చూసిన ఈ సినిమా పాటలే సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా సమంత చేసిన 'ఊ అంటావా మామా.. ఊహూ అంటావా' పాట శ్రోతలను వీపరితంగా ఆకట్టుకుంది. మత్తు వాయిస్‏తో సాగే ఈ పాట శ్రోతలచేత వన్స్ మోర్ అనిపిస్తోంది. చంద్రబోస్ ఈ పాటకి లిరిక్స్ అందించగా.. ఇంద్రావతి చౌహాన్ ఈ పాటను ఆలపించారు. దేవి మ్యూజిక్ అందించాడు. ఇప్పుడీ ఈ పాట యూట్యూబ్‌ ను షేక్‌ చేస్తోంది. పాటకి ఎంత రెస్పాన్స్ వచ్చిందో వివాదాలు కూడా అంతేస్థాయిలో చూట్టుముట్టుతున్నాయి.

ఇప్పటికే ఈ సాంగ్ పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ పురుషుల సంఘం కోర్టు ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మగవాళ్ళు కేవలం కామంతోనే ఉంటారన్న మీనింగ్ వచ్చేలా ఆ పాట ఉందని, ఆ పదాలతో అలాంటి భావమే వస్తోందని ఆ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా ఈ పాట పై తమిళనాడు పురుషుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ఈ పాటను తొలిగించాలని లేకపోతే ఈ పాటకు డ్యాన్స్‌ చేసిన సమంత, పాట పాడిన ఆండ్రియా, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌, గేయరచయిత వివేకాపై కేసు పెడతామని హెచ్చరించింది.

ఊ అంటావా మామా.. ఊహూ అంటావా అనే పాటని తెలుగులో చంద్రబోస్ రాస్తే తమిళ్ లో వివేకా రాశారు. 'ఓ సొల్‌రియా' అంటూ సాగే ఈ పాటకి అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఈ పాటకి 20 మిలియన్‌ పైగా వ్యూస్‌ వచ్చాయి.

Next Story

RELATED STORIES