Hero Tarun: ఆ హీరోలు వద్దనుకున్నారు.. తరుణ్ 'నువ్వే కావాలి' అంట హిట్ కొట్టాడు..

Hero Tarun: ఆ హీరోలు వద్దనుకున్నారు.. తరుణ్ నువ్వే కావాలి అంట హిట్ కొట్టాడు..
Hero Tarun: తరుణ్ కంటే ముందు నువ్వే కావాలి కథను ఇద్దరు హీరోలకు వినిపించాడట దర్శకుడు కె విజయ భాస్కర్.

Hero Tarun: దశాబ్దం క్రితం వరుస సినిమాలతో లవర్ బాయ్స్ అనిపించుకొని ప్రేక్షకులను అలరించిన హీరోలు చాలామంది వెండితెరకు దూరమయిపోయారు. అందులో ఒకడు తరుణ్. ఒకప్పుడు విపరీతమైన స్టార్‌డమ్‌ను చూసిన తరుణ్.. మెల్లమెల్లగా ఫేడ్ అవుట్ అయిపోయాడు. కానీ ఒకప్పుడు తరుణ్ నటించిన చాలా సినిమాలు ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్. అయితే తరుణ్‌ను లవర్ బాయ్‌ను చేసిన తన తొలి చిత్రం 'నువ్వే కావాలి' కథ ముందుగా ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేస్తే తన దగ్గరికి వచ్చిందట.

హీరో, హీరోయిన్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ముందుగా హీరోకు హీరోయిన్ మీద ప్రేమ పుడుతుంది. అది ఎలా చెప్పాలో, చెప్తే ఉన్న ఫ్రెండ్‌షిప్ పోతుందేమో అని సతమత పడుతుంటాడు. క్లైమాక్స్‌లో చెప్పేస్తాడు. ది ఎండ్. ఈ కథతో ఇప్పటికీ తెలుగులోనే కాదు.. ప్రతీ భాషలో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. కానీ ఆ అన్ని సినిమాలకు ముందుగా పునాది వేసింది 'నువ్వే కావాలి'.

తరుణ్, రిచా జంటగా నటించిన 'నువ్వే కావాలి' 2000లో విడుదలయ్యి అప్పటి యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. రూ.75 లక్షల బడ్జెట్‌తో ప్రారంభయిన ఈ చిత్రం క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకూడదన్న ఉద్దేశ్యంతో దాదాపు రూ.కోటిపైనే ఖర్చు చేశారు నిర్మాతలు. అయితే అనూహ్యంగా ఈ సినిమా రూ.20 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఆ సమయంలో చాలావరకు లాభాల్లో తెచ్చిపెట్టిన చిత్రాల్లో నువ్వే కావాలి కూడా ఒకటి.

అప్పటివరకు చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్‌ను.. హీరోగా నిలబెట్టింది నువ్వే కావాలి. కానీ తరుణ్ కంటే ముందు నువ్వే కావాలి కథను ఇద్దరు హీరోలకు వినిపించాడట దర్శకుడు కె విజయ భాస్కర్. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరకు నువ్వే కావాలి కథ వెళ్లిందట. కానీ తాను అప్పటికే తొలిప్రేమ, సుస్వాగతం లాంటి ప్రేమకథల్లో నటిస్తుండడంతో ఈ కథను రిజెక్ట్ చేశారు పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన తర్వాత నువ్వే కావాలి కథ సుమంత్ దగ్గరకు వెళ్లింది. కానీ సుమంత్ కూడా అప్పటికీ వరుస లవ్ స్టోరీలలోనే నటిస్తుండడంతో తాను కూడా ఈ కథను వద్దన్నాడు. చివరికి ఈ కథ తరుణ్ చేతికి వచ్చి తనకు హీరోగా సూపర్ డెబ్యూ ఇచ్చేలా చేసింది. ఆ తర్వత తరుణ్ ఎప్పటికీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పటికీ తరుణ్ కమ్ బ్యాక్ ఇస్తే చూడాలని చాలామంది ప్రేక్షకులు అనుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story