Gentleman-2 Movie Launch : లక్కీ విన్నర్స్ కు బంగారు నాణేలు బహూకరించనున్న ఆస్కార్ విజేత

Gentleman-2 Movie Launch : లక్కీ విన్నర్స్ కు బంగారు నాణేలు బహూకరించనున్న ఆస్కార్ విజేత
'జెంటిల్ మేన్ 2' మూవీ లాంఛ్ లో లక్కీ విన్నర్స్ కు బంగారు నాణేలతో సత్కారం

'జెంటిల్‌మన్‌-2'ని మెగా ప్రొడ్యూసర్‌ కేటీ కుంజుమోన్‌ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎ. గోకుల్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తుండగా, కవిపేరరసు వైరముత్తు సాహిత్యం అందిస్తున్నారు. తొట్ట తరణి ఎడిటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు, అజయన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలోనే ఈ చిత్రానికి సంగీత దర్శకుడి నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఈ చిత్రానికి సంగీత స్వరకర్తను అంచనా వేయమని కోరుతూ ఒక పోటీ నిర్వహించారు. ఇందులో పాల్గొని, సరైన సమాధానం చెప్పిన వారిలో ముగ్గురు అదృష్ట విజేతలకు బంగారు నాణెం బహుమతిగా ఇస్తామని కూడా చెప్పారు.

ఈ తరువాత, వేలాది మంది పార్టిసిపెంట్లు ఈ పోటీలో పాల్గొని, వారి అంచనాలను వెల్లడించారు. వారిలో వందలాది మంది MM కీరవాణి పేరును ప్రస్తావించారు. వీరిలో ఈరోడ్, బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు విజేతలుగా నిలిచారు. వారిలో జావిద్, మౌళి, శరత్ ఎంపికయ్యారు. మేము ప్రామిస్ చేసిన విధంగానే మా హామీని నిలబెట్టుకుంటాం. 'జెంటిల్‌మన్-2' సినిమా లాంచ్ సందర్భంగా ఈ ముగ్గురు లక్కీ విజేతలను సత్కరిస్తాం అని మెగా ప్రొడ్యూసర్ KT కుంజుమోన్ వెల్లడించారు.

ఆగస్టు 19న ఉదయం 10.30 గంటలకు చెన్నైలోని రాజా ముత్తయ్య హాల్‌లో ఈ కార్యక్రమం గ్రాండ్‌గా జరగనుంది. ఈ లక్కీ విన్నర్ అందరికీ సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణి బంగారు నాణేలను బహుమతిగా ఇవ్వనున్నారు. దీంతో ఈ వార్త మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా తెగ షేర్ అవుతోంది. ఇందులో ఎంఎం కీరవాణి బహుమతిగా ఇవ్వబోయే ఆ బంగార నాణేలను చూపించారు.

కొన్నేళ్ల క్రితం శంకర్ దర్శకత్వంలో అర్జున్ సర్జా హీరోగా మధుబాల హీరోయిన్ గా తెరకెక్కిన యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ 'జెంటిల్ మేన్'. ఈ మూవీ తమిళ్ తో పాటు అప్పట్లో తెలుగులో కూడా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమాని నిర్మించిన ప్రముఖ నిర్మాత కెటి కుంజుమోన్ దీనికి సీక్వెల్ గా 'జెంటిల్ మేన్ 2' ని తీసుకువస్తున్నారు. కాన్ఫిడెన్స్ ఈజ్ అవర్ ట్రేడ్ మార్క్ అనే క్యాప్షన్ తో తెరకెక్కిన 'జెంటిల్ మేన్ 2' మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో తో పాటు అందరినీ ఆకట్టుకుని సినిమా పై మంచి అంచనాలు ఏర్పరిచింది.


Tags

Read MoreRead Less
Next Story