Narayan Das Narang : లవ్‌స్టోరీ మూవీ నిర్మాత కన్నుమూత..!

Narayan Das Narang : లవ్‌స్టోరీ మూవీ నిర్మాత కన్నుమూత..!
Narayan Das Narang : గతకొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Narayan Das Narang : తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం నెలకొంది. చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు, ఏషియన్‌ మల్టీప్లెక్స్‌, థియేటర్స్‌ అధినేత నారాయణదాస్‌ నారంగ్‌ (78) కన్నుమూశారు. గతకొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌ గా, మూవీ ఫైనాన్షియర్‌గా సినీ పరిశ్రమకు ఆయన సేవలు అందించారు. నాగచైతన్య, సాయిపల్లవి మెయిన్ లీడ్ లో వచ్చిన లవ్‌స్టోరీ సినిమాని శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో ఆయన తెరకెక్కించారు.

ప్రస్తుతం నాగార్జునతో ఘోస్ట్‌, ధనుష్‌తో మరో చిత్రం నిర్మిస్తున్నారు. నారాయణదాస్‌ మృతిపట్ల సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story