బాలయ్య హీరోయిన్‎ గుర్తుందా..? ఇప్పుడెలా మారిపోయిందో

బాలయ్య హీరోయిన్‎ గుర్తుందా..? ఇప్పుడెలా మారిపోయిందో
Rachna Banerjee: ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన సినిమాల్లో ఒకటి 'నేను ప్రేమిస్తున్నాను'.

ఒకప్పటి టాలీవుడ్ రచన బెనర్జీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. దివంగత దర్శకులు ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన సినిమాల్లో ఒకటి 'నేను ప్రేమిస్తున్నాను'. ఆ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా రచన ఎంట్రీ ఇచ్చింది. రచనా బెనర్జీ బెంగాళీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. ఒరియా, బెంగాళీ భాషా పలు చిత్రాల్లో ఆమె నటించింది. జె.డి.చక్రవర్తి హీరోగా నటించిన 'నేను ప్రేమిస్తున్నాను' 1997లో విడుదలై విజయం అందుకుంది. రచనా బెనర్జీ ఒరియాలో యాభైకి పైగా సినిమాలలో నటించింది.

ఆ సినిమా విజయం తర్వాత రచన తెలుగులో వరుస అవకాశాలు దక్కాయి. అటు ఒరియా, బెంగాళీ భాషా సినిమాలలో నటిస్తూనే టాలీవుడ్ లో కూడా నటించింది. 1998 లో ఇ.వి.వి. దర్శకత్వంలో వచ్చిన మరో చిత్రం కన్యాదానం. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. రచన నటనకు అన్ని వైపుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారూ బాగున్నారా మూవీలో రంభ సోదరిగా నటించింది. ఆ తర్వాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, నందమూరి బాలకృష్ణ, జగపతిబాబు, సుమన్, ఎస్.వి.కృష్ణారెడ్డి ఇలా అందరి హీరోలతో కలిసి నటించింది. రచన 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమా తర్వాత టాలీవుడ్‌లో కనిపించలేదు. అందుకు కారణం వ్యక్తిగత జీవితంలోనూ బిజీగా మారడమే. హిందీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో తీసిన 'సూర్యవంశ్' సినిమాలో నటించి ఆకట్టుకుంది.

రచన(Rachna Banerjee) చేసిన యాభైకి పైగా సినిమాలలో నలభైకి పైగా సిద్ధాంత్ మహాపాత్రతో కలిసి నటించడం విశేషం. ఆ తర్వాత ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్నారు. కానీ పెళ్ళైన వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు కారణంగా కొన్నాళ్ళకే విడాకులు తీసుకున్నారు. అంతేకాదు అక్కడ అగ్ర కథానాయకుడిగా వెలుగుతున్న సిద్ధాంత్ మహాపాత్రతో కలిసి నటించలేక ఏకంగా ఒరియా ఇండస్ట్రీనే వదిలేసింది. ఆ తర్వాత 2005లో ప్రొబల్ ని రెండవ పెళ్ళి చేసుకుంది.వీరికి ప్రొణీల్ అనే కొడుకు ఉన్నాడు. ఇండస్ట్రీ వదిలేసి ఇన్నేళ్ల తర్వాత రచన తన మనసులోని మాట బయట పెట్టింది. టాలీవుడ్‌లో మళ్ళీ అవకాశాలు వస్తే నటించేందుకు సిద్దంగా ఉన్నట్లు టాక్. అయితే టాలీవుడ్ లో రచనకు మళ్లీ అవకాశం ఇచ్చే దర్శకుడు ఎవరో చూడాలి.











Tags

Read MoreRead Less
Next Story