ఖైదీ మూవీలో హీరోయిన్‎గా ఛాన్స్ మిస్..లేదంటే ఈ నటి పరిస్థితి మరోలా..!

ఖైదీ మూవీలో హీరోయిన్‎గా ఛాన్స్ మిస్..లేదంటే ఈ నటి పరిస్థితి మరోలా..!
Khaidi Movie: సినిమా హిట్ అయితే చాలు అందులో నటించిన వారి తలరాత మారిపోయినట్లే. హీరో హీరోయిన్ల విషయంలో అయితే వారికి వరుస కట్టి ఆఫర్లు వస్తాయి.

Khaidi Movie: ఒక సినిమా హిట్ అయితే చాలు అందులో నటించిన వారి తలరాత మారిపోయినట్లే. హీరో హీరోయిన్ల విషయంలో అయితే వారికి వరుస కట్టి ఆఫర్లు వస్తాయి. 1983, సంయుక్త మూవీస్, ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో "ఖైదీ" సినిమా విడుదల అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ సినిమా ఆయన కెరీర్ లోనే ఓ మైల్ స్టోన్ గా నిలిచింది. మాధవి, సుమలత హీరోయిన్లుగా నటించారు. అయితే సినిమాలో మొదటి హీరోయిన్ గా మాధవి ఎంపికయ్యారు. ఇక రెండవ హీరోయిన్ గా సుమలతను తీసుకున్నారు. ఈ సినిమాలో ఓ నటికి హీరోయిన్ గా అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. ఆమె ఎవరో కాదు జయలలిత.

గుంటూరులో బి.ఏ పూర్తి చేసిన తర్వాత జయలలిత ఆంధ్ర నాట్యం నేర్చుకుంటానని హైదరాబాద్ వచ్చారు. అక్కడ తన తండ్రి స్నేహితులు "ఈ పోరాటం మార్పు కోసం" చిత్రం తీస్తున్నారని అందులో ఒక క్లాసికల్ డాన్సర్... పాత్ర ఉందని జయలలితకు చెప్పారు. అప్పుడు జయలలిత పూర్తిగా డాన్స్ మీదనే ఆసక్తి ఉండడంతో చేయనని చెప్పింది. ఈ ఒక్క సినిమాలో నటించు నీకు నచ్చకపోతే తిరిగి హైదరాబాద్ వచ్చేయని వాళ్ళ నాన్న చెప్పడంతో "ఈ పోరాటం మార్పు కోసం" అనే చిత్రంలో నటించడానికి ఒప్పుకుంది. ఆసినిమా చిత్రీకరణ విజయ గార్డెన్స్ జరుగుతుండగా ఖైదీ నిర్మాతలు నిరంజన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలు జయలలితను కలిశారు. ఖైదీ సినిమాలో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు.

వెంటనే హైదరాబాద్ నుంచి చెన్నై కి మారిపోయి మద్రాస్ లో లేక్ ఏరియాలో ఇంటిని కూడా చూశారు. ఇక రెండవ హీరోయిన్ గా సుమలతను తీసుకోవడానికి కంటే ముందు జయలలితకు అవకాశం ఇస్తానని చెప్పిన నిర్మాతలు హఠాత్తుగా ఆ స్థానంలో సుమలత ను తీసుకోవడం జరిగింది. అలా అవకాశం వచ్చినట్టే వచ్చి చేయి జారడంతో జయలలిత వాళ్ళ నాన్న ఎంతో బాధ పడ్డారు. జయలలిత సందిగ్ధంలో ఉన్న సమయంలో ఒక మలయాళం విలేఖరి ద్వారా అక్కడి సినిమాలో నటించే అవకాశం వచ్చింది.



మలయాళంలో చేసిన మొదటి సినిమాలోనే గ్లామరస్ పాత్ర కావడంతో.. తర్వాత సినిమాల్లో కూడా రొమాంటిక్, వ్యాంప్ క్యారెక్టర్సే ఎక్కువగా జయలలిత(Jayalalitha)కు వచ్చాయి. అప్పుడున్న పరిస్థితులలో తన కుటుంబాన్ని ఎలాగో అలాగా నెట్టుకు రావడానికి జయలలిత నటించాల్సి వచ్చింది.

ఒకవేళ చిరంజీవి ఖైదీ సినిమాలో జయలలిత హీరోయిన్ గా నటించి ఉంటే ఆమె భవిష్యత్తు అద్భుతంగా ఉండేది. అయితే ఖైదీ సినిమాలో హీరోయిన్ గా అవకాశం చేజారినా.. ఊహించని విధంగా జయలలితకు చిరంజీవి నటించిన "గ్యాంగ్ లీడర్" చిత్రంలో వ్యాంప్ పాత్రలో అవకాశం వచ్చింది. వచ్చిన ఎలాంటి అవకాశాన్ని ఆమె వదులుకోలేదు. ఆ తర్వాత మోహన్ బాబు హీరోగా నటించిన "రౌడీ గారి పెళ్ళాం" చిత్రంలో "యమ రంజు మీద ఉంది పుంజు" అనే పాటలో జయలలిత నటించారు. బాలయ్య లారీడ్రైవర్, కమల్ హాసన్ తో కలిసి ఓ సినిమా కూడా చేసింది.

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన "భరత్ అనే నేను" చిత్రంలో ఆమె అసెంబ్లీ స్పీకర్ గా నటించారు. పలు టెలివిజన్ సిరియల్స్ లో నటిస్తున్నారు. రాధ మధు వంటి సీరియల్ జయలలితకు మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం జయలలిత సీరియల్స్ లో మంచిపాత్రలు వస్తున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story