సినిమా

Lahari : కారుతో బైక్‌ను ఢీకొట్టిన బుల్లితెర‌ నటి లహరి..!

Lahari : శంషాబాద్ వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బుల్లితెర నటి లహరి కారులో అతివేగంగా వెళ్తూ ఓ బైకును ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతినికి తీవ్రగాయాలయ్యాయి

Lahari : కారుతో బైక్‌ను ఢీకొట్టిన బుల్లితెర‌ నటి లహరి..!
X
Lahari : శంషాబాద్ వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బుల్లితెర నటి లహరి కారులో అతివేగంగా వెళ్తూ ఓ బైకును ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతినికి తీవ్రగాయాలయ్యాయి. ఘటన జరిగిన తరువాత లహరి కారు నుంచి బయటకు దిగలేదు. అయితే ఆమెను బయటకు దిగాలంటూ స్థానికులు డిమాండ్ చేశారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను పొలీస్ స్టేషన్‌‌‌కి తరలించారు. అటు గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఔటర్ రింగ్ రోడ్డు పై ప్రైవేటు పెట్రోలింగ్ వాహనం నడిపే వ్యక్తి.. డ్యూటీ ముగించుకుని శంషాబాద్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. అయితే లహరి మ‌ద్యం సేవించి కారు నడిపిందా అన్న అనుమానంతో పరీక్షలు నిర్వహించారు. ఆమె మ‌ద్యం సేవించ‌లేద‌ని తెలిసింది.
Next Story

RELATED STORIES