Sita Kalyana Vaibhogame : పోచంపల్లి పరిసర ప్రాంతాలలో చివరి షెడ్యూల్.. రిలీజ్ ఎప్పుడంటే..

Sita Kalyana Vaibhogame : పోచంపల్లి పరిసర ప్రాంతాలలో చివరి షెడ్యూల్.. రిలీజ్ ఎప్పుడంటే..
దసరాకి థియేటర్లలో సందడి చేయనున్న 'సీతా కళ్యాణ వైభోగమే'

నూతన నటీనటులు సుమన్, గరీమ చౌహన్ జంటగా నటిస్తోన్న సినిమా 'సీతా కళ్యాణ వైభోగమే'. ఈ మూవీ సతీష్ పరమవేద దర్శకత్వంలో తెరెకెక్కుతోంది. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో రానున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంగా.. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇటీవలే చివరి షెడ్యూల్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు క్లాప్ ఇచ్చారు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. టైటిల్‌తోనే పాజిటివ్‌ వైబ్రేషన్స్ వచ్చేలా వైబ్ తీసుకువచ్చిన మేకర్స్.. ఇటీవలే గోవాలో ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ నేతృత్వంలో దాదాపు 250 మంది డ్యాన్సర్లతో ఒక పాటను చిత్రీకరించారు.

చక్కటి ఫ్యామిలీ ఫిల్మ్ గా, తెలంగాణ వైభవానికి అద్దం పట్టేలా ప్రొడ్యూసర్ రాచాల యుగంధర్ భారీ బడ్జెట్ తో 'సీతా కళ్యాణ వైభోగమే' నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా చివరి షెడ్యూల్ పోచంపల్లి పరిసర ప్రాంతాలలో మొదలైంది. నల్లమల అటవీ ప్రాంతంలో ప్రముఖ ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ నేతృత్వంలో 100 మంది ఫైటర్లతో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరపుకుంటున్న ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఈ సందర్భంగా తెలిపింది. ఇదిలా ఉండగా గగన్ విహారి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాగినీడు, శివాజీ రాజా, ప్రభావతి, రచ్చరవి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం చరణ్ అర్జున్, కెమెరామెన్ ప్రవీణ్ వనమాలి, ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రాఫర్లు భాను మాస్టర్, పోలకి విజయ్ వ్యవహరిస్తున్నారు.




Tags

Read MoreRead Less
Next Story